ఉప్పందించిన కేంద్రం, చంద్రబాబు కేసు వెనుక - ఢిల్లీ టు అమరావతి..!!

చంద్రబాబు కేసులో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఇప్పుడు వైసీపీ వర్సస్ టీడీపీ పొలిటికల్ వార్ గా టర్న్ తీసుకుంది. జనసేనాని పవన్ సైతం ఇది సీఎం జగన్ కక్ష్య పూరిత చర్యగా ఆరోపించారు. కానీ, ఈ కేసులో సీఐడీ కంటే ముందుగా కేంద్ర విచారణ సంస్థలు అనేక అంశాలు తేల్చాయి. ఈ స్కిల్ కుంభకోణానికి సంబంధించి కేంద్ర సంస్థలే ఉప్పందించాయని సమాచారం. కేంద్రం సంస్థలు ఇచ్చిన నివేదికలే కీలకంగా మారాయి.

చంద్రబాబు అరెస్ట్ వెనుక:స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సీఐడీ రిమాండ్ రిపోర్టు పైన వాదనల తరువాత ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. అయితే, అసలు చంద్రబాబుకు ఈ స్కాంలో ప్రమేయం లేదని టీడీపీ వాదిస్తోంది. ఇదే సమయంలో పూర్తి ఆధారాలతోనే సీఐడీ అరెస్ట్ చేసిందని ప్రభుత్వంలోని ముఖ్యులు...వైసీపీ నేతలు వాదిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ సైతం పూర్తి ఆధారాలు..సాక్ష్యాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేసారని చెప్పుకొచ్చారు. ఈ సమయంలో కేంద్ర విచారణ సంస్థల అంశం పైన పెద్దగా ప్రస్తావన రావటం లేదు. కానీ, చంద్రబాబు స్కిల్ స్కాం కేసు వెనుక అసలు విషయాలు వెలుగులోకి తెచ్చింది కేంద్రం సంస్థలేనని స్పష్టం అవుతోంది.

Skill Development Scam: CIDs focus on Chandrababu deepens with ED Report

కేంద్ర ఏజెన్సీలే కీలకంగా:స్కిల్ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలే సమాచారం ఇచ్చినట్లు కోర్టుకు సమర్పించిన చంద్రబాబు రిమాండ్ రిపోర్టులో సీఐడీ స్పష్టం చేసింది. 2018లో మహారాష్ట్రలో జిఎస్‌టి, ఆదాయపన్నుశాఖ (ఐటి), ఆ తర్వాతి కాలంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ నిర్వహించి న విచారణలో స్కాం బయటపడిందని వెల్లడించింది. ఆ నివేదకలే సిఐడి దర్యాప్తునకు ప్రాథమిక ఆధారాలుగా కనిపిస్తున్నాయి. స్కిల్‌ ప్రాజెక్టులో కీలకంగా ఉన్న డిజైన్‌టెక్‌ పూణె బేస్డ్‌ సంస్థ. ఎటువంటి వ్యాపార కార్యకలాపాలూ లేని సింగపూర్‌లో రిజిస్టరైన డొల్ల కంపెనీల పేరిట రూపొందించిన నకిలీ ఇన్వాయిస్‌లతో వస్తువులు, సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌లను కొనుగోలు చేయడంపై 2017-18లోనే పూణెకు చెందిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జిఎస్‌టి ఇంటెలిజెన్స్‌ దర్యాప్తు చేపట్టింది.

ఐటీ అధికారుల విచారణ:ఆ వెంటనే పూణె ఇన్‌కంట్యాక్స్‌ యూనిట్‌ విచారణ చేసింది. ఎపి ప్రభుత్వం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా డిజైన్‌టెక్‌కు విడుదలైన రూ.371 కోట్లలో కనీసం రూ.241 కోట్లు దుర్వినియోగం అయినట్లు ప్రాథమికంగా నిర్ధారించాయి. షెల్‌ కంపెనీలు బోగస్‌ ఇన్వాయిస్‌లు ఇవ్వడం వలన ఇది చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, కోర్స్‌వేర్‌, ఇతర వస్తువులు, సేవలు అందించకుండానే బ్యాంక్‌ ఖాతాలకు డబ్బు ట్రాన్స్‌ఫర్‌ అయింది. అక్కడి నుంచి హవాలా పద్ధతుల ద్వారా సొమ్ము బదిలీ చేశారని జిఎస్‌టి ఇంటెలిజెన్స్‌, ఇన్‌కంట్యాక్స్‌ డిపార్టుమెంట్లే తొలుత కనుగొన్నాయి. ఈ సమాచారంతోనే వైసిపి సర్కారు వచ్చాక అప్పటి ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అజేయ కల్లం స్కిల్‌ స్కాంపై అంతర్గతంగా విచారణ జరిపించి, ప్రాథమిక సాక్ష్యాధారం ప్రైమాఫెసీ ఉందని, సిఐడి దర్యాప్తునకు 2021 సెప్టెంబర్‌ 7న లేఖ రాశారు.

Skill Development Scam: CIDs focus on Chandrababu deepens with ED Report

సీఐడీ విచారణ ద్వారా:2021,డిసెంబర్‌ 7న సిఐడి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, వెనువెంటనే 2021, డిసెంబర్ 13న స్కిల్‌ కార్పొరేషన్‌కు డైరెక్టరుగా పనిచేసిన గంటా సుబ్బారావును తొలి నిందితునిగా అరెస్టు చేసింది. కాగా షెల్‌ కంపెనీలన్నీ సింగపూర్‌, ఇతర దేశాల బేస్డ్‌ కావడంతో మనీలాండ రింగ్‌ జరిగిందంటూ ఈడీ రంగంలోకి దిగింది. ఐటీ చంద్రబాబుకు నోటీసు ఇచ్చింది. కేసులో 22వ నిందితునిగా ఉన్న యోగేష్‌ గుప్తా, మనోజ్‌ వాసుదేవ పరదేశి మధ్య ఆర్థిక లావాదేవీలు ఆ నోటీస్‌కు ఆధారం. దీంతో, కేంద్ర విచారణ సంస్థలే ఈ కేసులో ఆధారాల సేకరణలో కీలకంగా పని చేసాయనే చర్చ ఇప్పుడు న్యాయ నిపుణుల్లో మొదలైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+