తల్లిపై హత్యాయత్నం: ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం

Son attempts to kill mother in Visakha district
విజయవాడ: విశాఖపట్నం నగరంలోని భీమిలిలో ఓ ఉన్మాది మద్యం మత్తులో తల్లిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి తప్పించుకున్న తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేశారు.

నిందితుడిని అరెస్ట్‌ చేసేందుకు యత్నించగా పోలీసులపైనా ఉన్మాది దాడికి యత్నించాడు. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు అతన్ని పట్టుకున్నారు.

రాజమండ్రి ఆటోనగర్‌ దగ్గర హైవేపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆగివున్న లారీని ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గాయపడిన మరో ఇద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలం కండ్యాంలో విషాదం నెలకొంది. కలహాలతో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో కూతురు, భార్య మృతి చెందగా, భర్త పరస్థితి ఆందోళనకరంగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+