పులివెందులలో వైసిపి నేతలకు అవమానం, భయమెందుకు: శ్రీకాంత్ రెడ్డి
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బుధవారం నాడు నిప్పులు చెరిగారు.
కడప: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి బుధవారం నాడు నిప్పులు చెరిగారు. పులివెందులలో ప్రోటోకాల్ పాటించకుండా తమ పార్టీ నాయకులను అవమానిస్తున్నారని ఆగ్రహించారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన ప్రాజెక్టులనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. 2004 వరకు రాయలసీమలో నిర్మించే ప్రాజెక్టులకు చంద్రబాబు నిధులు ఇవ్వలేదని ఆరోపించారు.

అలాగే, దుమ్ముగూడెం టెయిల్ పాండు ప్రాజెక్టును సాగర్తో అనుసంధానించి రాయలసీమకు 165 టీఎంసీల నీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గండికోట రిజర్వాయర్ విషయంలో చర్చకు టిడిపి ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. తాము చెప్పేవి వాస్తవాలు కాదని అధికార పార్టీ చెప్పగలదా అని నిలదీశారు. తెలుగు గంగను పూర్తి చేసింది వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల పైన చర్చకు సిద్ధమని, అలాగే ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.
-
జగన్ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్ కలకలం-హైకోర్టుకు వైసీపీ-డీజీపీకి ఘాటు లేఖ..! -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications