స్థానికత ఆధారంగానే ఉద్యోగుల పంపకాలు: పొన్నం
హైదరాబాద్: స్థానికత ఆధారంగానే ఉద్యోగుల పంపకాలు జరగాలని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. అందుబాటులో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు శుక్రవారం వివేక్ నివాసంలో సమావేశమయ్యారు. ఎన్నికలు జరిగిన తీరు, రాష్ట్ర విభజన నేపథ్యంలో పలు అంశాలపై చర్చించారు.
తెలంగాణలో సేద్యం బోర్లపై ఆధారపడి ఉన్నందున విద్యుత్ కేటాయింపుల్లో న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశం తర్వాత పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగస్తుల పంపకాలు స్థానికత ఆధారంగానే జరగాలని, ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట పెట్టకుండా తెలంగాణకు పాత సెక్రటేరియట్ ఇస్తూ, ఆంధ్రాకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరులకు సంబంధించిన భవనాన్ని ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో కురిసిన ఆకాల వర్షాలవల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగుల పంపకాలు జరగాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మొదటి నుంచీ అంటున్నారు.
కెసిఆర్ మాటనే పొన్నం ప్రభాకర్ చెప్పడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఆ డిమాండ్‌ను తెలంగాణ కాంగ్రెసు నేతలు ముందుకు తెస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications