Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై - మారుతున్న లెక్కలు..!!

ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతోంది. ఏడాది కాలంలోనే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు మారుతున్నాయి. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సీమ జిల్లాల్లో సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై చెప్పారు. పార్టీ అధినేత చంద్రబాబుకు తన రాజీనామా లేఖ పంపారు. పార్టీలో సుదీర్ఘ కాలం పని చేసిన ఆ నేత రాజీనామా ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఇదే సమయంలో ఆ నేత తదుపరి అడుగులు ఆసక్తి కరంగా మారుతున్నాయి.

సుగవాసి రాజీనామా
టీడీపీకి సీనియర్ నేత.. రాజంపేట ముఖ్యనేత సుగవాసి బాలసుబ్రమణ్యం రాజీనామా చేసారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకు పంపారు. పార్టీలో అనేక హోదాల్లో .. పలు మార్లు ఎన్నికల్లో పోటీ చేసిన సుగవాసి రాజీనామా పార్టీలో సంచలనంగా మారింది. కొంత కాలంగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో మనస్థాపానికి గురైన సుగవాసి రాజీనామా కు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్ధిగా రాజంపేట నుంచి పోటీ చేసిన సుగవాసి వైసీపీ అభ్యర్ధి ఆకేపాటి అమర్నాధ్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తరువాత నియోజకవర్గంలో.. జిల్లాలో మారుతున్న సమీకరణాల కారణంగా పార్టీ కార్యక్రమాలకు సుగవాసి దూరంగా ఉంటున్నారు.

sugavasi-balasubramnaym-resigned-for-tdp-details-here

మనస్థాపం
ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో పర్యటన సమయంలోనూ సుగవాసి హాజరు దూరంగానే ఉంటు న్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సుగవాసి పార్టీ సభల్లోనూ కీలక వ్యాఖ్య లు చేసారు. సొంత పార్టీకే చెందిన కీలక నాయకులపై శివాలెత్తిపోయారు. రాజంపేట నియోజక వర్గంలో జరుగుతున్న ప్రభుత్వ అధికారులు ఎవరూ రాకుండా.. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ భయపెట్టి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులతో కలిసి గత ఎన్నికల్లో తన ఓటమికి కుట్ర చేశారని వాపోయారు. ఎవరైతే ఎన్నికల్లో మోసం చేశారో వారి వివరాలు పార్టీ అధినాయకత్వం వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు. నాలుగు దశాబ్దాల కాలంగా పార్టీలో పని చేసిన సుగవాసి.. నియోజకవర్గంలో పరిస్థితులు వివరించినా వారి పైన చర్యలు తీసుకోకపోవటం మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది.

రాజీనామా వెనుక
అదే విధంగా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి అవినీతికి పాల్పడుతున్నాడని విమర్శలు చేశారు. నియోజకవర్గంలో ఇసుక దందాకు పాల్పడుతున్నారని పలు సందర్భాల్లో ఆరోపించారు. దీంతో, ఏడాది కాలం వారి పైన చర్యల కోసం వేచి చూసిన సుగవాసి.. ఇప్పుడు రాజీనామా లేఖలో తన నిర్ణయాన్ని వెల్లడించారు. ప్రజలు, సన్నిహితుల సూచనలు, మనోభావాలను, అభిప్రాయాలను గౌరవిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేసారు. ఇప్పుడు సుగవాసి రాజీనామా తరువాత పార్టీ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+