యోగా మాస్టర్ హత్య: దండుపాళ్యం సినిమా చూసి ముఠాగా...
విశాఖపట్నం: విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన యోగా మాస్టర్ పి. వెంకటరమణ హత్య కేసులో పోలీసులు అనుమానితులను గుర్తించినట్లు తెలుస్తోంది. వారు పోలీసుల అదుపులో ఉన్నట్లు వార్తలు వస్తనున్నాయి. సోమవారం రరాత్రి పెందుర్తి సమీపంలోని ఓ మారమూల ప్రాంతంలో మద్యం సేవిస్తుండగా వారు గస్తీ పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది.
ఆ ముఠాలో పి. వెంకటరమణ హత్య కేసుతో సంబంధం ఉన్న ఇద్దరు ఉన్నారని, వారి నుంచి సమాచారం రాబట్టారని అంటున్నారు. మిగతా నిందితులను కూడా ఆ సమాచారంతో అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇందులో అజయ్ కుమార్ కల్యాణ్, అనిల్, పవన్ అనేవారితో పాటు మరికొంత మంది ఉన్నట్లు తెలుస్తోంది.

ముఠాగా ఏర్పడి సుపారీ...
వెంకటరమణ హత్యకు కొంత మంది యువకులు ముఠాగా ఏర్పడి సుపారీ తీసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు కిలపర్తి వెంకటరమణ కెజిహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. కోలుకున్న తర్వాత అతన్ని అదుపులోకి తీసుకుంటారని చెబుతున్నారు.

దండుపాళ్యం సినిమా చూసి...
దండుపాళ్యం సినిమా చూసిన యువకులు దండుపాళ్యం బ్యాచ్‌గా ఏర్పడ్డారని సమాచారం. వారు బర్మాకేంప్, చుట్టుపక్కల ప్రాంతాలకు చెందినవారని తెలుస్తోంది. బ్యాచ్‌గా ఏర్పడి చిన్నపాటి నేరాలు చేయడం ప్రారంభించారు మద్యం దుకాణాల వద్ద ముసలివాళ్లను కొట్టి డబ్బులు లాక్కోవడం వంటి నేరాలు చేసేవారు. ఆ తర్వాత పెద్ద నేరాలకు పూనుకున్నారు.

పెద్ద నేరాలు ఇలా మొదలు..
ఎవరినైనా కొట్టాలన్నా, చంపాలన్నా సుపారీ తీసుకుని నేరాలు చేయడం ప్రారంభించారని తెలుస్తోంది. బ్యాచ్‌కు చెందిన ఆరుగురిపై ఇంతకు ముందుేసులు కూడా ఉన్నాయని చెబుతున్నారు. వారిలో అజయ్ కుమార్‌కు బాల్యం నుంచి నేరప్రవృత్తి ఉందని అంటున్నారు.

జనగోల ఎడిటర్ నుంచి సుపారీ తీసుకుని..
మరో నిందితుడు కల్యాణ్ ఓ హత్య కేసులో నిందితుడు. మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. యోగా మాస్టర్ హత్యలో వీరు పాల్గొన్నట్లు సమాచారం. జనగోల ఎడిటర్ కె. వెంకటరమణ నుంచి సుపారీ తీసుకుని యోగా మాస్టర్‌ను హత్య చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications