దోబూచులాట: కెసిఆర్‌తో మళ్లీ తలసాని భేటీ

Talasani meets KCR again today
హైదరాబాద్: పార్టీ మారే విషయంలో తెలుగుదేశం పార్టీ సనత్‌నగర్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాస యాదవ్ ఇంకా దోబుచులాడుతూనే ఉన్నారు. పలుమార్లు ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును కలిశారు. సోమవారం ఉదయం మరోసారి ఆయన కెసిఆర్‌ను కలిశారు.

కెసిఆర్‌ను ఆయన ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సమావేశానికి గల కారణాలు తెలియరాలేదు. తలసాని శ్రీనివాస యాదవ్ చాలా కాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావుకు టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయన అలిగినట్లు చెబుతున్నారు.

కెసిఆర్‌ను కలిసిన ప్రతిసారీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెరాసలో చేరిపోతారంటూ ఊహాగానాలు చెలరేగుతూ వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై ఆయన ఇప్పటి వరకు పెదవి విప్పలేదు. తన నివాసంలో జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన కెసిఆర్‌నే కాకుండా చంద్రబాబును కూడా ఆహ్వానించారు. వీరిద్దరు విడివిడిగా వేర్వేరు సమయాల్లో తలసాని ఇంటికి వెళ్లారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస యాదవ్ కెసిఆర్‌తో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓ బస్తీలో కూలిపోయిన ఇళ్ల కోసం కెసిఆర్‌ను కలిసి ఆ బస్తీకి ఆయనను తీసుకుని వెళ్లారు. దసరా పర్వదినం తర్వాత తలసాని శ్రీనివాస యాదవ్‌తో పాటు ఇంకా కొంత మంది తెరాసలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+