ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఘోర రోడ్డు ప్రమాదం.. నోట్లో ఇరుక్కుపోయిన స్టీరింగ్, ఇద్దరు మృతి

అతి వేగం ఇద్దరి ప్రాణాలు తీసింది. మరో ఏడుమందిని క్షతగాత్రులను చేసింది. తీవ్రంగా గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం దగ్గర హైవేపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన స్కార్పియో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.

ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్రమైన గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అత్యవసర చికిత్స నిమిత్తం క్షతగాత్రులను ఒంగోలులోని రిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తిరుపతి నుంచి గుంటూరుకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది.

Tanguturu accident kills 2 of Guntur district

స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వాహన డ్రైవర్ సుబ్బారావు, మరో వ్యక్తి పడవల సాయిశంకర్ మృతి చెందారని, మృతులిద్దరూ గుంటూరు జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు.

అతి వేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పేర్కొన్నారు. కారులో ఎయిర్ బ్యాగ్స్‌ కూడా లేనట్లుగా తెలుస్తోంది. అందువల్లే డ్రైవర్‌తో పాటు ముందు వైపు కూర్చున్న మరో వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే డ్రైవర్ నోట్లో స్టీరింగ్ ఇరుక్కుపోయి ఉండడాన్ని గమనించవచ్చు.

English summary
Two persons were killed and seven others injured in a tragic road accident in Prakasam district in the wee hours of Tuesday. The accident was the result of a speeding Scorpio vehicle dashing against a parked lorry on the highway at Surrareddy Palem in Tangutur Mandalam. The injured were shifted to RIMS Hospital at Ongole. Reports said the condition of four of them is said to be critical. The killed were identified as the driver Subba Rao and one Padavala Sai Sankar, both from Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X