వంశీ నివాసం వద్ద టీడీపీ శ్రేణుల హల్ చల్..!!
ఏపీలో ఎన్నికల ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఫలితాల వెల్లడి తరువాత రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో రాజకీయ దాడులు కొనసాగుతున్నాయి. వీటి పైన పార్టీ నేతలతో తాజాగా జగన్ స్పందించారు. వైసీపీ గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. పార్టీ కేడర్ కు అండగా నిలవాలని నేతలకు జగన్ సూచించారు. ఇక, టీడీపీ పైన విరుచుకుపడిన కొడాలి నాని..వల్లభనేని వంశీ ఇప్పుడు ఆ పార్ట కేడర్ కు టార్గెట్ అయ్యారు. తాజాగా వంశీ ఇంటి వద్ద టీడీపీ శ్రేణులు హల్ చల్ చేసారు.
విజయవాడలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంటి పైన దాడికి ప్రయత్నం జరిగింది. టిడిపి మద్దతు దారులు వంశీ నివాసము ఉండే అపార్ట్మెంట్ ను నాలుగు వైపులా చుట్టు ముట్టి.. వాహనాల్లో అటూ ఇటూ తిరుగుతూ హల్చల్ చేశారు. వంశి ఉంటున్న ఫ్లోర్ వైపు రాళ్లు వేశారు. పోలీసులు రంగంలోకి దిగి టిడిపి శ్రేణుల్ని చెదరగొట్టారు. నాలుగు కార్లలో వంశీ నివాస వద్దకు చేరుకున్న టిడిపి క్యాడర్ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వంశీ ఇంట్లోనే ఉన్నారని సమాచారంతో గేట్లు పగలకొట్టే ప్రయత్నం చేశారు.

కర్రలు, రాళ్లతో యువకులు రావటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అక్కడున్న వారిని పంపించి వేశారు. అంతకుముందు మాజీ మంత్రి కొడాలి నాని నివాసం వద్ద ఇలాంటి పరిస్థితే చోటుచేసుకుంది.
నాని ఇంటి పైకి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు, గుడ్లు విసిరారు. ఆ తర్వాత టపాసులు కాల్చుతూ హంగామా చేశారు.
వల్లభనేని వంశీ ఇంటి వద్ద టీడీపీ శ్రేణుల హల్చల్..!!#VallabhaneniVamsi #TDP #Chandrababu #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/zRoLACIZoI
— oneindiatelugu (@oneindiatelugu) June 7, 2024
ఇంట్లోకి చొచ్చుకొని పోయే ప్రయత్నమూ జరిగింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకొని వారిని పంపించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలోను పోలీసులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న రాజకీయ సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇప్పుడు ఉద్రిక్తతకు కారణమవుతున్నాయి.












Click it and Unblock the Notifications