వైసీపీ చేస్తుందిదే - ఇవీ ఆధారాలు : ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ..!!
చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తక్షణ చర్యలు తీసుకోవాలన చంద్రబాబు డిమాండ్ చేసారు.
చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైఎస్సార్సీపీ పార్టీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు.. అక్రమాలు జరుగుతున్నాయంటూ లేఖలో పేర్కొన్నారు. వైసీపీ నేతలతో అధికారులకు కుమ్మక్కై బోగస్ ఓట్ల నమోదు చేసారని ఫిర్యాదు చేసారు. బోగస్, నకిలీ ఓట్లను ఓటర్ల జాబితాలో చేర్చడం వల్ల ఎన్నికల ప్రక్రియ అపహాస్యం అవుతోందని మండిపడ్డారు. తక్షణ చర్యలు తీసుకోవాలన చంద్రబాబు డిమాండ్ చేసారు.
ఏపీలో రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటర్ల నమోదు విషయంలో టీడీపీ కొంత కాలంగా అధికార వైసీపీ పైన ఆరోపణలు చేస్తోంది. బోగస్ ఓట్ల నమోదు చేసారని ఆరోపిస్తున్నారు. వైసీపీ ముఖ్య నేత సజ్జల ఈ ఆరోపణలను ఖండించారు. ఆ అవసరం తమకు లేదన్నారు. టీడీపీ ముందుగానే ఓటమికి సాకులు వెతుక్కుంటోందని కౌంటర్ ఇచ్చారు. ఇదే సమయంలో చంద్రబాబు చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. డిగ్రీ చదవని వ్యక్తులు, నకిలీ సర్టిఫికెట్లతో ఓటర్లుగా నమోదు అయ్యారని పేర్కొన్నారు. గెలుపు కోసం వైసీపీ అడ్డదారులు తొక్కుతోందని చంద్రబాబు తన లేఖలో ఫిర్యాదు చేసారు. ఇప్పటికే ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అనర్హులను చేర్చినట్లు సాక్ష్యాధారాలను కూడా జతచేశారు.

గతంలో తిరుపతి ఉప ఎన్నికల్లో బోగస్ ఓట్లు ఇదే రకంగా చేర్చారని లేఖలో ప్రస్తావించారు. నేడు అదే పునరావృతం అవుతోందని వివరించారు. తప్పుడు చిరునామాలతో వైఎస్సార్సీపీ అభ్యర్థికి అనుకూలంగా పెద్ద సంఖ్యలో ఓటర్లను చేర్చారని ఫిర్యాదు చేసారు. ఎన్నికల అధికారులు అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై నకిలీ డిగ్రీ సర్టిఫికెట్తో ఓటర్లుగా చేరారని ఆరోపించారు. కొందరు అధికారులు నకిలీ పత్రాలపై పరిశీలన జరపకుండానే, ఉద్దేశ పూర్వకంగానే ఆమోదం తెలిపారని చంద్రబాబు లేఖలో స్పష్టం చేశారు. పలు ప్రాంతాల్లో బోగస్ ఓట్ల తంతు ఉందని కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇందులో సహకరించిన వారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేసారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వాలని చంద్రబాబు కోరారు.












Click it and Unblock the Notifications