లోకేష్ ఫ్లెక్సీ కడుతుండగా విషాదం: విద్యుత్ షాక్‌తో కార్యకర్త మృతి!..
టీడీపీ కార్యకర్త మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనపై పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మృతుడి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకోవడంతో..
చిత్తూరు: మంత్రి నారా లోకేష్ ఫ్లెక్సీ కడుతున్న సమయంలో టీడీపీ కార్యకర్త ఒకరు ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డాడు. చిత్తూరు జిల్లా సోమల మండలం కందూరు గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్న సమయంలో.. విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే అతను ప్రాణాలు కోల్పోయాడు.
టీడీపీ కార్యకర్త మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ దుర్ఘటనపై పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మృతుడి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకోవడంతో.. అతనికి అండగా నిలుస్తామని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కాగా, గతంలోను లోకేష్ తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా ఆయన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ.. అనిల్ కుమార్(25) అనే వ్యక్తి మృత్యువాత పడటం గమనార్హం. షార్ట్ సర్క్యూట్ తో తీవ్ర గాయాలపాలైన అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.












Click it and Unblock the Notifications