బీజేపీ ఎంపీ స్వామికి అవినీతి సామ్రాట్ జగన్‌తో ఉన్న లాలూచీ ఏమిటో?: టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్
తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేక విమానంలో ఏపీకి వచ్చిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి.. ముఖ్యమంత్రి జగన్ ను కలవడంపై టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. లాయర్ గా ఎంతో మంది అవినీతి ముఖ్యమంత్రులను జైలుకు పంపిన స్వామి.. అవినీతి చక్రవర్తి జగన్ తో కలిసి భోజనం చేయడమేంటని ప్రశ్నించారు.
అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడిన వెంకన్న.. సుబ్రహ్మణ్యస్వామికి జగన్‌తో ఉన్న లాలూచీ ఏమిటో, వారిద్దరి మధ్య జరిగిన చర్చలేమిటో ఆయనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సీఎంతో భేటీ తర్వాత స్వామి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అవినీతి జరిగిందని, వాటిపై దర్యాప్తు చేయించాలనడంపైనా బుద్ధా మండిపడ్డారు.

ఎవరి మెప్పుకోసం సుబ్రహ్మణ్యస్వామి చంద్రబాబుని లక్ష్యంగా చేసుకొని పసలేని ఆరోపణలు చేశారని వెంకన్న ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాలతోనే సుబ్రహ్మణ్యస్వామి, జగన్‌తో సమావేశమయ్యాడని ప్రజలకు అర్థమైందన్నారు. జగన్ పై, వైసీపీ ప్రభుత్వ అవినీతిపై టీడీపీ పోరాడుతూనే ఉందన్న సందగతి స్వామికి తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుకోసం అధికార వైసీపీ వేలకోట్లు ఖర్చుచేసిందని, పోలీసులు, అధికారుల సాయంతో టీడీపీ వారిని అడ్డుకొని రాత్రికి రాత్రే డబ్బు పంపిణీ చేశారని, మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడానికి జగన్ ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న భయమే కారణమని బుద్దా వెంకన్న ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఫలానా రంగు చొక్కా వేసుకోవాలని రూలేమీ లేకున్నా, మాజీ మంత్రి కొల్లురవీంద్రను వైసీపీ సర్కారు అరెస్టు చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. కాగా,
ఏపీ సీఎం జగన్ ను కలిసిన సందర్భంలో బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అనూహ్య వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ను ప్రైవేటీకరించాలన్న కేంద్రం నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని, ప్రభుత్వ సంస్థలను గుడ్డిగా ప్రైవేటీకరణ చేయడం సరికాదని, స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోడానికి ఏపీ ప్రభత్వం చేసే ప్రయత్నాలకు తాను అండగా ఉంటానని ఎంపీ అన్నారు. వ్యాపారం చేయడం ప్రభుత్వ విధానం కారాదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ప్రభుత్వం వ్యాపారం చేయొచ్చా? లేదా? అనేదాన్ని కేస్ బై కేస్ చూడాలని సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications