రోజా దిష్టిబొమ్మ దగ్ధం: 'బ్లాక్‌మెయిలా.. ప్రతాప్ రెడ్డికి జగనే ఇచ్చి మరిచారేమో'
విజయవాడ/అనంతపురం: కృష్ణా జిల్లాలోని పలుచోట్ల తెలుగుదేశం పార్టీ మహిళా కార్యకర్తలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రోజా, కొడాలి నాని దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. అసెంబ్లీలో అసభ్యకర వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అంటూ నినాదాలు చేస్తూ వారు గురువారం దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.
జగన్‌కు అర్హత లేదు: పల్లె
వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేతగా కూడా అర్హత లేదని మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ మరిచారా: లింగారెడ్డి
బాక్సైట్ విషయంలో ఏపీ ప్రభుత్వంపై జగన్ చేస్తున్న విమర్శలపై రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ ఛైర్మన్ లింగారెడ్డి మండిపడ్డారు. బాక్సైట్ అంశంలో జగన్‌ది ద్వంద్వ వైఖరి అని ధ్వజమెత్తారు. పెన్నా గ్రూప్‌కు బాక్సైట్ కేటాయింపులు చేయించింది తానే అన్న విషయం జగన్ మరిచిపోయినట్టున్నారని ఎద్దేవా చెప్పారు.

అందుకు ప్రతిఫలంగా జగతి గ్రూప్‌లో పెన్నా గ్రూప్ రూ.68 కోట్లు పెట్టుబడులు పెట్టిందని విమర్శించారు. ఇటు కర్నూలులో 304 హెక్టార్ల సున్నపురాయి గనులు పెన్నాకు కేటాయించారన్నారు. బంజారాహిల్స్‌లో నాలుగు నక్షత్రాల హోటల్ నిర్మాణానికి వైయస్ రాజశేఖర రెడ్డి సడలింపు ఇచ్చారన్నారు.
అప్పటి సెటిల్మెంట్లు ఇంకా పూర్తి కాలేదేమో అందుకే జగన్... ప్రతాప్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టుగా ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. పెన్నా ప్రతాప్ రెడ్డి ఇకనైనా అప్రూవర్‌గా మారాలన్నారు. బాక్సైట్ పైన తెలుగుదేశం పార్టీ చర్చకు సిద్ధమన్నారు.












Click it and Unblock the Notifications