ముస్లింలకు ఏ ప్రభుత్వమూ చేయని రీతిలో టిడిపి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు:తెదేపా మంత్రులు
గుంటూరు:దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వమూ అమలు చేయని రీతిలో ముస్లింలకు టిడిపి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అందించిందని రాష్ట్ర మంత్రులు పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం గుంటూరు బీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న ముస్లిం మైనార్టీ సదస్సు 'నారా హమారా.. టీడీపీ హమారా' సదస్సు ఏర్పాట్లను పలువురు టిడిపి మంత్రులు,ఎమ్మెల్యేలతో కూడిన బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి కళావెంకట్రావ్ మాట్లాడుతూ మైనార్టీలను ప్రత్యేకంగా చూసి వారి అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తున్నది తెలుగుదేశం పార్టీ ఒక్కటేనని చెప్పుకొచ్చారు.

ఏర్పాట్లు...పరిశీలన
మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు గుంటూరు బీఆర్ స్టేడియంలో జరిగే "నారా హమారా...టిడిపి హమారా"...ముస్లిం మైనార్టీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు కళావెంకట్రావు,నక్కా ఆనందబాబు, అయ్యన్నపాత్రుడు, ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. అనంతరం మంత్రి కళావెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మతసామరస్యానికి అధిక ప్రాధాన్యం ఇచ్చిందని, తెదేపా హయాంలో మత కలహాలు ఎప్పుడూ జరగలేదని చెప్పారు.
ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని రీతిలో సంక్షేమ కార్యక్రమాలను తెదేపా అమలు చేసిందని చెప్పారు.

ఓటు బ్యాంకుగా...చూశాయి
గత ప్రభుత్వాలన్నీ ముస్లింలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకున్నాయే తప్ప వారి సంక్షేమాన్ని ఏనాడూ పట్టించుకోలేదని మంత్రులు పుల్లారావు, ఆనందబాబు పేర్కొన్నారు. బిజెపికి మద్దతిచ్చామన్న కారణంతో మైనార్టీలు తమ పార్టీకి దూరం జరిగినా మళ్లీ తెదేపా ప్రభుత్వం చిత్తశుద్ధితో వారి కోసం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తించారని చెప్పారు. మోదీ ప్రభుత్వంపై తెదేపా చేస్తున్న పోరాటాన్ని వారంతా స్వాగతిస్తున్నారని, పెద్ద ఎత్తున ఈ సదస్సులో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారని అన్నారు.

నభూతో...నభవిష్యత్...చందంగా
మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ మంగళవారం జరిగే ముస్లిం మైనార్టీ సభ న భూతో న భవిష్యత్ అన్న విధంగా జరగబోతుందన్నారు. ముస్లిం అభివృద్ధి కి చంద్రబాబు చేస్తున్న కృషికి ముస్లింలు టీడీపీ కి నారా హమారా...టిడిపి హమారా అంటూ మద్దతు పలుకుతున్నారని చెప్పారు. కేంద్రప్రభుత్వం, మోడీ పై చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజలు మద్దతిస్తున్నారని, 4 సంవత్సరాల్లో టిడిపి చేసిన అభివృద్ధి తో పాటు చేయబోయే అభివృద్ధి గురించి ఈ సభలో వెల్లడిస్తామని మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు.

విజయవంతం...చేయండి
మరోవైపు జిల్లాల వారితీ టిడిపి నేతలు మంగళవారం గుంటూరులో జరిగే నారా హమారా...టిడిపి హమారా ముస్లిం మైనార్టీ సభ ను విజయవంతం చేసేందుకు తీసుకోవల్సిన చర్యల గురించి ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో కడప టిడిపి పార్టీ ఆఫీస్ లో జిల్లా అధ్యక్షులు శ్రీనివాస రెడ్డి ముస్లిం నాయకులతో మాట్లాడుతూ నారా హమారా టిడిపి హమారా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు. సోమవారం రాత్రి 9 గంటలకు మునిసిపల్ స్టేడియం నుంచి బస్సులు గుంటూరు బయలుదేరుతాయని చెప్పారు.
-
నెలకు రూ.80,500 జీతంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేకుండానే !! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications