చైనాలో భారీ ప్రమాదం.. అత్యంత ఎత్తైన స్కైస్క్రాపర్‌ను ఢీకొట్టిన చిన్న విమానం !!

చైనా రాజధాని బీజింగ్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. నగరంలోని అత్యంత ఎత్తైన భవనాల్లో ఒకటైన సిటిక్ టవర్ (CITIC Tower) ను ఒక చిన్న విమానం ఢీ కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనతో బీజింగ్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ (CBD) ప్రాంతంలో తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రమాదం జరిగిన వెంటనే భవనంలో ఉన్న ఉద్యోగులు, సందర్శకులను అత్యవసరంగా బయటకు తరలించారు.

సుమారు 528 మీటర్ల ఎత్తు కలిగిన సిటిక్ టవర్ పైభాగంలోని అంతస్తులను విమానం ఢీకొట్టినట్లు వీడియోల్లో కనిపిస్తోంది. ఢీకొన్న ప్రభావంతో భవనం నుంచి గాజు ముక్కలు, ఇతర శకలాలు కింద ఉన్న పాదచారుల మార్గం, పచ్చిక ప్రదేశాలపై పడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో వందలాది మంది ఉద్యోగులు ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ప్రాణనష్టం లేదా గాయాలపై అధికారులు వెంటనే ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడించలేదు.

small-aircraft-accident-at-chinese-capital-beijing-and-crashed-into-the-tallest-building-citic-tower

భారీ ఎత్తున భద్రతా చర్యలు..

ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. భవనం చుట్టుపక్కల రహదారులను పూర్తిగా మూసివేసి, ప్రజలను అక్కడి నుంచి దూరంగా పంపించారు. అంబులెన్సులు, ఫైర్ ఇంజిన్లు పెద్ద సంఖ్యలో మోహరించడంతో ఆ ప్రాంతమంతా హై అలర్ట్‌లోకి వెళ్లింది. డ్రోన్ల సహాయంతో భవనం పరిస్థితిని అధికారులు పరిశీలించినట్లు సమాచారం.

ప్రత్యక్ష సాక్షులు చెప్పిందేంటి?

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌తో మాట్లాడిన లిన్ అనే మహిళ, సాయంత్రం 6 గంటల సమయంలో భవనం నుంచి అత్యవసరంగా బయటకు వెళ్లాలని సెక్యూరిటీ సిబ్బంది సూచించారని తెలిపారు. "ఏం జరుగుతుందో అర్థం కాకుండానే ఐడీ కార్డు, బ్యాగ్ కూడా తీసుకోకుండా బయటకు పరుగెత్తాను" అని ఆమె చెప్పారు. మరో ఉద్యోగి మాట్లాడుతూ... "సాయంత్రం 5.40 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. మొదట అది పేలుడు అనుకున్నాం. తర్వాత అందరినీ వెంటనే బయటకు పంపించారు" అని తెలిపారు.

ఇంకా మిస్టరీగానే ప్రమాదానికి కారణం..

అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది? విమానం ఎక్కడి నుంచి బయలుదేరింది? సాంకేతిక లోపం కారణమా? లేక పైలట్ నియంత్రణ కోల్పోయాడా? అనే అంశాలపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు? పైలట్ పరిస్థితి ఏంటి? అనే వివరాలు కూడా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. చైనా పౌర విమానయాన శాఖ, స్థానిక భద్రతా సంస్థలు ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

సిటిక్ టవర్ ప్రత్యేకత ఏమిటి?

సిటిక్ టవర్‌ను "చైనా జున్" (China Zun) పేరుతో కూడా పిలుస్తారు. ఇది బీజింగ్ నగరానికి ప్రతీకగా నిలిచే అత్యంత ప్రతిష్ఠాత్మక ఆకాశహర్మ్యాల్లో ఒకటి. సుమారు 528 మీటర్ల ఎత్తుతో ఇది చైనాలోని ఎత్తైన భవనాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇందులో అనేక అంతర్జాతీయ కంపెనీల కార్యాలయాలు, వ్యాపార సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ ఘటన తర్వాత బీజింగ్‌లోని ఎత్తైన భవనాల చుట్టూ అమలులో ఉన్న వైమానిక భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+