సీఎం చంద్రబాబుతో టీడీపీ ఎమ్మెల్యే 'పేకాట' ముచ్చట్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పడిన తర్వాత ఏపీని ప్రగతి బాటలో ముందుకు తీసుకువెళ్లాలని చంద్రబాబు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాడు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులు మళ్ళీ ఈ ప్రభుత్వ హయాంలో జరగకుండా ఉండేందుకు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ టిడిపి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఏపీని ఎటువైపుకు తీసుకువెళతాయి అన్న చర్చకు కారణంగా మారింది.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే
అనంతపురం టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్బులను తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్తానని ఆయన పేర్కొన్నారు. తన వద్దకు చాలామంది పేకాట క్లబ్లు తెరిపించాలని వస్తున్నారని, వారికి త్వరలోనే పేకాటక క్లబ్లు తెరిపిస్తానని హామీ ఇచ్చానని ఈ విషయంపైన చంద్రబాబుతో మాట్లాడతానని అనంతపురం టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వెల్లడించారు.

పేకాట క్లబ్బులు తెరిపించేందుకు ఎమ్మెల్యే కృషి
పేకాట క్లబ్లను తెరిపించే విషయంపైన ఇప్పటికే తాను కలెక్టర్ తో మాట్లాడానని తెలిపారు. ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన పేకాట ఆడక పోవడం వల్ల మనిషి జీవిత కాలం తగ్గిపోయిందని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దీంతో ఈ వీడియోను వైసిపి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెలుగుదేశం పార్టీని చెడుగుడు ఆడుతోంది.
మంచి కట్టుబాట్లు.. వైసీపీ ట్రోల్స్
మంచి మంచి కట్టుబాట్లు పెట్టుకుంటున్నారని, చంద్రబాబుతో మాట్లాడి పేకట క్లబ్బులు తెరిపిస్తానని టిడిపి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చెప్పారని వీడియో షేర్ చేస్తున్నారు. అనంతపురం ఆఫీసర్స్ క్లబ్ లో పేకాట ఆడిస్తానని, ఒక అనంతపురంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేకాటక క్లబ్బులు తెరిపించడానికి చంద్రబాబుతో మాట్లాడతానని ఆయన చెప్పడం ఇప్పుడు ఏపీలో అన్ని వర్గాల వారిని విస్మయానికి గురిచేస్తుందని వైసిపి నేతలు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
మంచి మంచి కట్టుబాట్లు...
— Jagananna Connects (@JaganannaCNCTS) July 30, 2024
చంద్రబాబుతో మాట్లాడి పేకాట క్లబ్లు తెరిపిస్తా
- టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్#AndhraPradesh #SaveAPFromTDP pic.twitter.com/8iy7dDxFyN
పేకాట బ్యాన్ చేసిన జగన్.. చంద్రబాబు హయాంలో ఇలా
తమ అధినేత జగన్ పేకాటను బ్యాన్ చేసి అసాంఘిక కార్యకలాపాలు లేకుండా చేస్తే, చంద్రబాబు వచ్చిన తర్వాత రాష్ట్రం మళ్ళీ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతుందని వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో పేకాట బ్యాన్ చేసి నాలుగైదు ఏళ్ళు అవుతోందని, చంద్రబాబుతో మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా క్లబ్బులలో పేకాట ఆడించేందుకు కృషి చేస్తానని ఒక ఎమ్మెల్యే చెప్పడం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది . మరి దీనిపై చంద్రబాబు ఏమంటారో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications