అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కొత్త ట్విస్ట్, 'అమరావతి బాధ్యత లోకేష్‌కు': మంత్రులపై అసంతృప్తా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ బుధవారం అన్నారు. లోకేష్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటేనే సీఎం చంద్రబాబు కలలు సాకారం అవుతాయన్నారు. అమరావతి నిర్మాణం, అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు బాధ్యతలు లోకేష్‌కు అప్పగించాలన్నారు.

కాగా, అమరావతి నిర్మాణ బాధ్యతలను లోకేష్‌కు అప్పగించాలని శ్రవణ్ కుమార్ చెప్పడం చర్చనీయాంశమైంది. మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావుల పైన ఆయన అసంతృప్తితో ఉన్నారా అనే చర్చ సాగుతోంది. అందుకే లోకేష్ పేరు తెరపైకి తీసుకు వచ్చి ఉంటారని అంటున్నారు.

రాజధాని విషయంలో నారాయణకు ఫస్ట్ ర్యాంక్: ఆనం

మంత్రి నారాయణకు ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ రాకపోయినా రాజధాని నిర్మాణంలో ఫస్ట్ ర్యాంక్ ఖాయమని టిడిపి నేత ఆనం వివేకానంద రెడ్డి చెప్పారు. వైసిపి అధినేత జగన్‌కు ప్రత్యేక హోదాకు, ప్రత్యేక ప్యాకేజీకి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. తన తండ్రి హయాంలో దోచుకున్న దానిని ప్యాకేజీగా భావిస్తున్నారన్నారు. ఏపీ పునర్ నిర్మాణంపై జగన్‌కు అవగాహన లేదన్నారు.

TDP MLA suggests CM Chandrababu to hand over Amravati Construction to Lokesh

2019లో చంద్రబాబు మళ్లీ సీఎం: లోకేష్

2019 ఎన్నికల్లోను చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అవుతారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం నాడు ధీమా వ్యక్తం చేశారు. ఆయన ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం మండలం మిట్టపాలెంలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. చంద్రబాబు ఏపీ అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడుతున్నారన్నారు. 24 గంటలు కరెంట్ ఇచ్చిన ఘతన తెలుగుదేశం పార్టీదే అన్నారు. అనంతరం ఎర్రగొండపాలెంలో నారా లోకేష్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పలువురు మంత్రులు పాల్గొన్నారు.

English summary
TDP MLA suggests CM Chandrababu to hand over Amravati Construction to Nara Lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X