నెల్లూరు: మాజీలపై టిడిపి వల, వైసీపీకి చెక్ పెట్టే ప్లాన్ ఇదే

నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో టిడిపిని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ వ్యూహలు రచిస్తోంది.

నెల్లూరు: నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గంలో టిడిపిని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ వ్యూహలు రచిస్తోంది. ఈ నియోజకవర్గంలో గతంలో రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నవారిని తిరిగి పార్టీలోకి ఆహ్వనించేందుకు టిడిపి నేతలు పావులు కదుపుతున్నారు. కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన మానుగుంట మహీధర్‌రెడ్డి, కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డిలతో టీడీపీ నేతలు ఇటీవల చర్చలు జరిపారు.

2019 ఎన్నికల్లో మరిన్ని అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకొనేందుకు టిడిపి ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. నెల్లూరు జిల్లాలో వైసీపీకి మంచి పట్టుంది. అయితే రానున్న ఎన్నికల్లో వైసీపీని దెబ్బ తీసేందుకు టిడిపి వ్యూహత్మకంగా ప్లాన్ చేస్తోంది.

నెల్లూరు జిల్లాలో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడంతో పాటు నెల్లూరు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని టిడిపి నాయకత్వం వ్యూహలు రచిస్తోంది. ఈ మేరకు పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యేలతో చర్చిస్తున్నారు.

 నెల్లూరులో మాజీలపై టిడిపి వల

నెల్లూరులో మాజీలపై టిడిపి వల

నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్లో టిడిపిని బలోపేతం చేసేందుకు టిడిపి నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఈ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో మాజీ ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకొనేందుకు ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. మాజీ మంత్రి మహీధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డితో టిడిపి నాయకత్వం చర్చలు జరిపినట్టు సమాచారం..

నెల్లూరు ఎంపీ సెగ్మెంట్లో టిడిపికి ఇద్దరే ఎమ్మెల్యేలు

నెల్లూరు ఎంపీ సెగ్మెంట్లో టిడిపికి ఇద్దరే ఎమ్మెల్యేలు

నెల్లూరు పార్లమెంటు పరిధిలో నెల్లూరు సిటీ, రూరల్‌, కోవూరు, ఉదయగిరి. ఆత్మకూరు, కావలితో పాటు ప్రకాశం జిల్లాలోని కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.2014 ఎన్నికల్లో కోవూరు, ఉదయగిరిలలో టీడపీ అభ్యర్ధులు గెలుపొందారు. మిగిలిన ఐదు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు..అయితే ఈ పార్లమెంట్ సెగ్మెంట్‌లోని పట్టున్న నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలపై టిడిపి కన్నేసింది. వారితో చర్చలు జరుపుతోంది.

 సోమిరెడ్డికి మహీధర్ రెడ్డి దగ్గరి బంధువు

సోమిరెడ్డికి మహీధర్ రెడ్డి దగ్గరి బంధువు

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన మహీధర్ రెడ్డి మొదటి నుండి టిడిపి నేతలతో సఖ్యతగానే ఉన్నారనే ప్రచారం కూడ ఉంది. అంతేకాదు మహీధర్‌రెడ్డి ప్రస్తుత ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి దగ్గరి బంధువు కూడ. ఆనం సోదరులు, ఆదాల ప్రభాకర్‌రెడ్డిలతో సన్నిహితంగానే ఉంటారని ప్రచారంలో ఉంది. ఈ తరుణంలోనే మహీధర్‌రెడ్డితో టిడిపి నేతలు చర్చలు జరిపారని అంటున్నారు.

ఒంటేరుతో నెల్లూరు నేతల చర్చలు

ఒంటేరుతో నెల్లూరు నేతల చర్చలు

కావలి మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి 2014 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు.స్థానికంగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణంగా ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ వీ జయరామిరెడ్డి, వంటేరు వేణుగోపాల్‌రెడ్డి తోడల్లుళ్లు. నాలుగు రోజలు క్రితం హైదరాబాదులో జయరామిరెడ్డి స్వగృహంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్ ఒంటేరు వేణుగోపాల్ రెడ్డితో చర్చించారని సమాచారం. ఈ సమావేశంలో మహీధర్‌రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+