చంద్రబాబు సీరియస్: క్షమాపణ చెప్తే సరి లేదంటే కేఈపై సస్పెన్షన్ వేటు?
అమరావతి: రాజ్యసభ ఎన్నికలు ఏపీ టీడీపీలో పెను కలకలాన్ని సృష్టించాయి. రాజ్యసభ సీటును టీజీ వెంకటేశ్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ కర్నూలు టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగిన కేఈ ప్రభాకర్‌ను పార్టీ సస్సెండ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళితే... టీడీపీకి వచ్చే మూడు రాజ్యసభ సీట్లలో ఒకటి మిత్రధర్మంలో భాగంగా బీజేపీకి కేటాయించగా మిగతా రెండింటిలో ఒకటి కేంద్ర మంత్రి సుజనా చౌదరికి, మరొక సీటను కర్నూలు జిల్లాకు చెందిన టీజీ వెంకటేశ్‌కు అధినేత చంద్రబాబు కేటాయించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో రాజ్యసభ సీటుని టీజీ వెంకటేశ్‌కు కేటాయించడాన్ని నిరసిస్తూ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ ధర్నాకు దిగారు. పార్టీకి చిరకాలంగా సేవ చేస్తున్న వారిని కాదని, పార్టీలోకి కొత్తగా వచ్చిన టిజి వెంకటేష్ కి రాజ్యసభ సీటు కేటాయించడం అన్యాయం అని, ఇలాగైతే జిల్లాలో పార్టీని భూస్థాపితం చేస్తానని అన్నారు.

టీడీపీని కూకటి వేళ్ళతో సహా పెకలించివేస్తానని ఆగ్రహంతో ఊగిపోయారు. బీసీలకు అన్యాయం చేస్తున్నారంటూ ఆయన అనుచరులు సైతం పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేయడం ఏంటని అధినేత చంద్రబాబు కూడా ప్రభాకర్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఈ విషయమై ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ "టీడీపీ క్రమశిక్షణకి మారుపేరు. క్రమశిక్షణ ఉల్లంఘించి పార్టీకి ఎవరు చెడ్డపేరు తెచ్చినా చర్యలు తప్పవు. పదవి దక్కలేదని రోడ్ల మీదకి వచ్చి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తే సహించబోము. తమ్ముడైనా.. కుమారుడైన సరే!" అని శుక్రవారం మీడియాతో అన్నారు.
అయితే జరిగిన దానిపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కలిసి క్షమాపణలు చెపితే ఇంతటితో మందలింపుతో సరిపెట్టవచ్చని లేదంటే ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేసే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications