అసెంబ్లీ గొడవ వీడియో రిలీజ్: రోజా సైగ, అసలు విషయం తెలిసిందా?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో జరిగిన ఘర్షణ దృశ్యాలను తెలుగుదేశం పార్టీ బుధవారం సాయంత్రం విడుదల చేసింది. వీడియోలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా, కొడాలి నాని తదితరులు టీడీపీ సభ్యుల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా ఉంది. రోజా అదే పనిగా తిడుతున్నట్లు, సైగలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. స్పీకర్ పోడియం వద్ద దృశ్యాలను విడుదల చేశారు.

ఈ వీడియోలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి. రెండు రోజులుగా అసెంబ్లీలోని రగడ.. అధికార టీడీపీని ఇరకాటంలో పడేసింది. దీంతో వీడియోలను విడుదల చేసి.. తాము ఉత్తినే ఆగ్రహానికి గురి కాలేదని చెప్పే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది.

 TDP releases Video of Assembly

రెండు రోజులుగా సభలోని ఘటన పైన అధికార పక్షం డిఫెన్స్‌లో పడింది. సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయకుండానే.. అధికార పార్టీ అభ్యంతరకరంగా వ్యవహరించిందని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో డిఫెన్స్‌లో పడిన టీడీపీ వీడియోలను విడుదల చేసింది.

తద్వారా తమ తప్పు మాత్రమే లేదని చెప్పడానికి ప్రయత్నించినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. వీడియోలో అధికార పక్షం గోల చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రతిపక్షం రెచ్చగొట్టాకే అధికార పార్టీ రెచ్చిపోయినట్లుగా ఉందని దీని ద్వారా చెప్పదల్చుకున్నట్లుగా తెలుస్తోందంటున్నారు. మొత్తంగా ఇది ఒక వైపు తప్పుకాదని చెప్పదల్చుకున్నారని అంటున్నారు.

సాయంత్రం ప్రభుత్వ చీఫ్ కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీ వీడియో దృశ్యాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాసన సభలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఎమ్మెల్యే రోజా పైన చర్యలు తీసుకోవాలని తాము శాసన సభాపతిని కోరినట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+