ఎమ్మెల్సీ ఎన్నికల ముందు చంద్రబాబు సర్కార్‌కు బిగ్ షాక్
ఎమ్మెల్సీ ఎన్నికల ముందు చంద్రబాబు సర్కార్‌కు బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా టీడీపీ నాయకురాలు సుధారాణి నడుచుకున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి సొంత మహిళా నాయకులు సుధారాణి ఊహించని షాక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్యంగా సుధారాణి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. దీనిపై సుధారాణి మాట్లాడుతూ.. అయితే ఎమ్మెల్సీ అవ్వాలనే ఆసక్తితోనే తాను ఇండిపెంటెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిపారు.
తన నామినేషన్ విషయంలో టీడీపీకి ఎటువంటి సంబంధం లేదని సుధారాణి స్పష్టం చేశారు. గతంలో సుధారాణి భర్త రఘురాజు ఎమ్మెల్సీగా పని చేశారు. ప్రస్తుతం సుధారాణి ఎస్.కోట వైస్ ఎంపీపీగా, స్టేట్ టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేను కానీ, కూటమి నేతలను ఎవర్ని సంప్రదించకుండానే ఆమె స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సుధారాణి బరిలో ఉంటే కూటమి గెలుపు కష్టతరంగా మారుతుంది. దీంతో టీడీపీ నాయకులు వెంటనే రంగంలోకి దిగి ఆమెను బుజ్జగించి నామినేషన్ వెనక్కి తీసుకోమ్మని కోరుతున్నారు.

దీనిపై ఒకటి, రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటు ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి పోటీ చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో సుధారాణి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం ప్రస్తుతం ఉమ్మడి విజయనగరంలో హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications