రంగారెడ్డి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లేడీ టెక్కీ సూసైడ్: చెల్లీ, కుక్క జాగ్రత్త అని సూసైడ్ నోట్

|
Google Oneindia TeluguNews

 A techie commits suicide in Rangareddy
రంగారెడ్డి: జిల్లాలోని జవహర్‌నగర్‌కు చెందిన ఓ యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు ఎవరూ కారణం కాదని, చెల్లినీ, కుక్క మోనునూ జాగ్రత్త చూసుకోవాలని ఆమె రాసిన సూసైడ్ నోట్‌లో తల్లిదండ్రులను కోరింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు జరుపుతున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడుకు చెందిన విశ్రాంత నేవీ ఉద్యోగి సూర్య క్రాంతం, విజయలక్ష్మి దంపతులు గత 20 ఏళ్లుగా జవహర్‌నగర్‌లోని ఎక్స్ సర్వీస్‌మెన్ కాలనీలో ఉంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు సునీత (26), హేమలత ఉన్నారు. సునీత ఏఎస్‌రావు నగర్‌లోని ఇరిటెల్ సైబర్ టెక్ కంపెనీలో మూడేళ్లుగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగం నిర్వహిస్తున్నారు.

గత కొన్ని రోజులుగా సునీతకు, ఆమె తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. గురువారం చిన్న కూతురు హేమతో కలిసి విజయలక్ష్మి షాపింగ్‌కు వెళ్లింది. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న క్రాంతం, విధుల నిమిత్తం బయటికి వెళ్లారు. కాగా తనకు ఆరోగ్యం బాగోలేదని సునీత ఇంట్లోనే ఉండిపోయారు. షాపింగ్‌కు వెళ్లిన సునీత తల్లీ, చెల్లెలు తిరిగి ఇంటికి చ్చారు.

ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని చనిపోయిన సునీతను చూసిని తల్లీ, చెల్లెలు తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సునీత రాసిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సునీత సెల్‌ఫోన్‌కు వేర్ ఆర్ యూ అని సందేశం వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. సునీత ఫోన్ కాల్ డేటాను సేకరించి విచారణ జరుపుతున్నామని, ఆమె హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

English summary
A software engineer on Thursday committed suicide in Jawahar Nagar, Ranga Reddy district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X