భార్య, తనయుడి గొంతుకోసి.. యూపి టెక్కీ ఆత్మహత్య
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మాదాపూర్‌లో ఓ సాఫ్టువేర్ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. హైటెక్ సిటీలోని ఓ సాఫ్టువేర్ కంపెనీలో పని చేస్తున్న మనీష్ సాహు, అతని భార్య శ్వేత సాహు, వారి కుమారుడు యాష్‌లు మాదాపూర్‌లో గల మై హోం అపార్టుమెంట్స్‌లో విగత జీవులుగా కనిపించారు.
మనీష్ సాహు స్వస్థలం ఉత్తర ప్రదేశ్. వారు మూడేళ్లుగా మై హోం అపార్టుమెంటులో ఉంటున్నారు. మనీష్ సాహు నాలుగు రోజులుగా విధులకు వెళ్లడం లేదు. దీంతో అనుమానం వచ్చిన ఆ సంస్థ ఉద్యోగులు ఇంటికి వచ్చి చూశారు. ఇంట్లో నుండి దుర్వాసన వచ్చింది.

దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు లోపలకు వెళ్లి చూడగా తల్లీ, కుమారుడు రక్తపు మడుగులో విగత జీవిగా ఉన్నారు. మనీష్ సాహు అదే గదిలో కిటీకికి ఉరేసుకొని ఉన్నాడు. కాగా, మనీష్ తన భార్య శ్వేత సాహు, తనయుడు యాష్‌ల గొంతు కోసి హతమార్చి ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకొని ఉంటాడని భావిస్తున్నారు.
కర్నూలులో దారుణం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఇసుక మాఫియా తీవ్ర ఘాతుకానికి పాల్పడింది. ఓర్వకల్లు మండలం నన్నూరు సమీపంలోని నిట్‌లో స్థలాన్ని పరిశీలిస్తుండగా రెవెన్యూ సిబ్బందిపై ఇసుక లారీ ఒక్కసారిగా దూసుకెళ్లింది. దాంతో, అక్కడిక్కడే ముగ్గురు గ్రామ సేవకులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఓర్వకల్లు తహశీల్దారు, ఆర్ఐలను కర్నూలు ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications