అమెరికాకు పరారీ: ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన టెక్కీ

కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్ సంస్థలో న్యూజెర్సీలో అతను పనిచేస్తున్నాడు. అతన్ని బేగంపేటలోని యుఎస్ కాన్సులేట్ కార్యాలయం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని హైదరాబాదులోని హిమాయత్‌నగర్‌కు చెందిన 33 ఏళ్ల పి లక్ష్మీ రామకృష్ణ మోహన్‌గా గుర్తించారు.
చాలా కాలంగా రామకృష్ణ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతనిపై వరకట్నం వేధింపుల కేసు ఉంది. దాంతో అరెస్టు నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. డిసిపి విజ్ఞప్తి మెరేకు సిసిఎస్ అతనిపై 2013లో బ్లూ కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది.
హైదరాబాద్ సిఐడి ఇంటర్‌పోల్ ఎస్పీ ఇచ్చిన సమాచారం మేరకు సిసిఎస్ పోలీసులు మోహన్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు.












Click it and Unblock the Notifications