తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌కు కేంద్రంలో ఆర్థిక శాఖ: అమిత్ షాతో ఏపీకి మేలు జరిగేనా?
కేంద్ర కేబినెట్‌లో ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖలు కేటాయించారు. దేశంలోనే ఆర్దిక శాఖ నిర్వహిస్తున్న రెండో మహిళగా ఇప్పుడు రికార్డు సాధించారు. తెలుగింటి ఆడపడుచు అయిన నిర్మలా సీతారామన్ తమిళనాడుకు చెందిన వారైనా ఏపీకీ చెందిన పరకాల ప్రభాకర్‌ను వివాహమ చేసుకున్నారు. గతంలో కేంద్ర వాణిజ్య శాఖా మంత్రిగా పని చేసే సమయంలో ఏపీ నుండే రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇప్పుడు ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వేళ..ఆర్దికంగా ఇబ్బందులు..కేంద్ర సాయం కోసం నిరీక్షిస్తున్న వేళ ఇప్పుడు సీతా రామన్..అమిత్ షా పాత్ర కీలకం కానుంది..
ఏపీ కోడలుకు కేంద్రంలో ఆర్దిక శాఖ..
నిర్మలా సీతారామన్‌కు ప్రధాని మోదీ కీలకమైన ఆర్దిక శాఖ కేటాయించారు. ఇప్పటి వరకు ఆర్దిక శాఖ నిర్వహించిన అరుణ్ జైట్లీ మంత్రి పదవి స్వీకరించటానికి నిరాకరించటంతో ఇప్పుడు నిర్మాలా సీతా రామన్ ఆర్దిక మంత్రి అయ్యారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం పాలన ఖర్చు మొత్తం ఓడి మీద..రుణాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికి ముందే జగన్ ఢిల్లీలో ప్రధానిని కలిసి రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని వివరించారు.
ప్రధాని సైతం ఏపీకి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఇక, ఏపీలో ప్రభుత్వం అధికారికంగా ఏర్పడటం తో ముఖ్యమంత్రి జగన్ త్వరలో ఢిల్లీకి వెళ్లి అధికారిక హోదాలో కేంద్రానికి ఏపీ పరిస్థితిని నివేదించనున్నారు. ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ పైన ఎటువంటి దృష్టి పెడతారనే ఆసక్తి నెలకొని ఉంది. ఏపీకి కేంద్ర సాయం పైన గతంలోనూ నిర్మాలా సీతారామన్ సానుకూలంగా స్పందించారు. దీంతో..ఇప్పుడు నిర్మలా సీతారామన్ చేతికే ఆర్దిక శాఖ రావటంతో ఏ రకంగా అండగా నిలుస్తారో చూడాలి.

అమిత్‌షా మీదే కీలక బాధ్యత..
రాష్ట్ర విభజన సమయంలో పునర్విభజన చట్టం అమలు బాధ్యత కేంద్ర హోం శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో హోం శాఖ ఏపీ సమస్యల గురించి సీరియస్‌గా తీసుకోలేదు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు..సంస్థల ఏర్పాటు..తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారం వంటివి కేంద్ర హోం శాఖ పర్యవేక్షణ లో ఉంటుంది.
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్న అమిత్ షా సహాయం సైతం ఏపీకీ అవసరమని ఢిల్లీలో జగన్ స్పష్టం చేసారు. ఢిల్లీ పర్యటనలో అమిత్ షాతోనూ భేటీ అయ్యారు. ఇక, ఇప్పుడు ఇటు ఏపీలో అటు కేంద్రంలో ప్రమాణ స్వీకారాలు..అధికారిక లాంఛనాలు పూర్తయ్యాయి. దీంతో.. ఇప్పుడు కేంద్రం తీరు ఏపీ పైన ఎలా ఉంటుంది..గతం కంటే ఏమైనా భిన్నంగా ఉంటుందా..ఏపీ పైన దృష్టి సారిస్తుందా అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications