కడప, నెల్లూరుల్లో టిడిపిVsజగన్‌పార్టీ, ఎస్సైకి గాయాలు

వీరు పోలీసులపై కూడా వారు దాడి చేశారు. ఈ క్రమంలో ఎస్ఐ సైదులుతో పాటు మరో కానిస్టేబుల్‌కు కూడా గాయపడ్డారు. రెండు పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి. డిఎస్పీ బాల వెంకటేశ్వర రావు ఆధ్వర్యంలో గ్రామంలో 144వ సెక్షన్ విధించారు.
కడప జిల్లాలో...
పోలింగ్ ముగిసినా తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కడప జిల్లా ఖాజీపేట మండలం సరన్‌ఖాన్ పేటలో ఇరు పార్టీల కార్యకర్తలు తీవ్ర ఘర్షణకు దిగారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.
జమ్మల మడుగులోను
జమ్మలమడుగులోను వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ వర్గాలు గురువారం ఉదయం పరస్పరం దాడులకు దిగాయి. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు చేశారు.












Click it and Unblock the Notifications