కానిస్టేబుల్ ఇంట్లో దొంగ తాళాలతో చోరీ
ఒంగోలు: ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రంగన్న ఇంట్లో దొంగలు చోరీకి తెగబడ్డారు. రంగన్నతో పాటు కుటుంబ సభ్యులు మరో గదిలో నిద్రిస్తున్న సమయంలో దొంగ తాళం చెవితో తలుపులు తెరిచారు. బీరువాను నకిలీ తాళంతో తీసి రూ.4 లక్షల నగదుతో పాటు 14 సవర్ల బంగారాన్ని అపహరించారు. ఉదయం చూసిన రంగన్న కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. దొంగ తాళాలలో దొంగిలించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications