ముందే ఊహించా, జగన్‌లాంటి వాళ్లు వస్తే అంతే: ఏపీ అసెంబ్లీపై జేసీ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలను తాను ముందే ఊహించామని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి గురువారం అన్నారు. అవగాహన లేనివాళ్లు చట్టసభలకు వస్తే ఇలాగే జరుగుతుందని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నాడు.
బీహార్‌లోనో, ఉత్తర ప్రదేశ్‌లోనే ఎప్పుడో జరిగినటువంటి ఇలాంటి సంఘటనలు తప్పకుండా ఏపీ అసెంబ్లీలో జరుగుతాయని ముందే అనుకున్నామని, అలాగే జరుగుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఎలాంటి అనుభవం లేని, ప్రజాస్వామ్య విలువలు తెలియని వాళ్లు ఉన్నారని, అందుకే ఇలా జరుగుతోందన్నారు.
రాజ్‌నాథ్‌ను కలిసిన రాయలసీమ బీజేపీ నేతలు

కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో రాయలసీమ బీజేపీ నేతలు గురువారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విభజన చట్టంలోని హామీలు అమలు చేయాలని కేంద్రమంత్రికి నేతలు వినతి చేశారు.
సదానంద గౌడతో టీఆర్‌ఎస్ ఎంపీల భేటీ
కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యులు గురువారం ఉదయం సమావేశమయ్యారు. ప్రత్యేక హైకోర్టును ఏర్పాటుపై వారు చర్చించారు. కాగా, ప్రత్యేక హైకోర్టు కోసం తెలంగాణ శాసన సభ బుధవారం ఏకగ్రీవ తీర్మానం చేసింది.












Click it and Unblock the Notifications