యువత సూసైడ్ టి కోసం, ఓవైసీ మాటలు నమ్మి: బైరెడ్డి

హైదరాబాద్: వెయ్యి మంది తెలంగాణ ప్రాంత యువత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మత్యాగాలు చేశారు తప్ప రాయల తెలంగాణ కోసం కాదని, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మాటలు నమ్మి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్ర విభజన చేస్తున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆదివారం మండిపడ్డారు.

తెలుగు జాతిని విడదీయాలని చూడటం దారుణమన్నారు. వెయ్యిమంది ఆత్మ బలిదానం చేసుకుంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసమని, రాయల తెలంగాణ కోసం కాదని అన్నారు. దోచుకున్నది కాపాడుకోవడం కోసమే సీమ నేతలు రాయల సీమ విభజన కోరుతున్నారని బైరెడ్డి ఆరోపించారు. రాయలసీమకు ప్రత్యేక అస్తిత్వం ఉందని ఆయన అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాయల తెలంగాణను అంగీకరించబోమని బైరెడ్డి స్పష్టం చేశారు. ఆయన బిజెపి నేతలను కలిశారు.

కాగా, ఆదివారం బైరెడ్డి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసి రాయల తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ఇవ్వరాదని కోరారు. అనంతరం బైరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ అస్తిత్వాన్ని నాశనం చేసే కుట్రను తిప్పిగొట్టాలన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన చేసింది మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ రాయల తెలంగాణ ఏర్పాటు బిల్లుకు పార్లమెంటులో మద్దతు ఇవ్వరాదని తాను బిజెపిని కోరానన్నారు.

బైరెడ్డి 1

బైరెడ్డి 1

రాయలసీమలోని కర్నూలు, అనంతపురంలోని 28 అసెంబ్లీ నియోజకవర్గాలు తెలంగాణలో 119 నియోజకవర్గాలతో కలిస్తే, ఈ రెండు జిల్లాలను చిన్నచూపు చూస్తారని బైరెడ్డి చెప్పారు.

బైరెడ్డి 2

బైరెడ్డి 2

రాయలసీమ నేతలు చంద్రబాబు నాయుడు, వైయస్ జగన్, కిరణ్ కుమార్ రెడ్డి రాయలసీమ విచ్ఛిన్నానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నారన్నారు.

బైరెడ్డి 3

బైరెడ్డి 3

స్వార్ధ ప్రయోజనాల కోసం కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి రాయల తెలంగాణ ప్రతిపాదనను తెర పైకి తెచ్చారన్నారు. సాగు నీటి రంగానికి పెద్ద విఘాతం కలుగుతుందన్నారు. తమ ఉద్యోగావకాశాలు దెబ్బతింటాయన్నారు.

బైరెడ్డి 4

బైరెడ్డి 4

వెయ్యి మంది తెలంగాణ ప్రాంత యువత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మత్యాగాలు చేశారు తప్ప రాయల తెలంగాణ కోసం కాదని, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ మాటలు నమ్మి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్ర విభజన చేస్తున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆదివారం మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+