సాయం పేరుతో బాలికపై నెలరోజులుగా ముగ్గురి దారుణం

ఆ ముగ్గురూ బాలికను దుర్గగుడిలోనే పరిచయం చేసుకుని, ఈ అఘాయిత్యానికి పాల్పడడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. హైదరాబాదుకు చెందిన ఓ పదహారేళ్ల బాలిక కుటుంబ సభ్యులు మందలించడంతో ఇంటి నుంచి పారిపోయి, గత నెల మూడో తేదీన విజయవాడ ఇంద్రకీలాద్రికి చేరుకుంది.
కొండపై ఒంటరిగా తిరుగుతున్న బాలికపై దేవస్థానం ప్రాంగణంలోని షాపులో పని చేస్తున్న ఓ యువకుడి కన్నుపడింది. బాలిక వివరాలు తెలుసుకొని అండగా ఉంటానని చెపప్పాడు. తనకు తెలిసిన ఓ మహిళ ఇంట్లో ఆ బాలికను కొన్ని రోజులు ఉంచి, చేరదీసినట్టు నటించాడు. ఆ తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పది రోజుల అనంతరం బాలికను తన వద్ద నుంచి పంపించేశాడు. ఇలా మరో ఇద్దరు చేశారు.
శనివారం తిరిగి కొండ పైకి చేరుకున్న ఆ బాలికను విధుల్లో ఉన్న పోలీసులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌నకు తరలించారు. పోలీసులు ఆ బాలికను విచారించగా కుటుంబ సభ్యులు మందలించడంతో ఇంటి నుంచి పారిపోయి ఇక్కడకు వచ్చినట్టు తెలిపింది.
విచారణ అనంతరం ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. బాలిక ఫిర్యాదుపై పోలీసులు అత్యాచారానికి పాల్పడిన నిందితులపై నిర్భయ చట్టం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ముగ్గురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications