వారికి నో హామీ: టిడిపిలోకి చేరికపై గంటా లిస్ట్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మంత్రులు గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాప రెడ్డి, టిజి వెంకటేశ్‌కు లైన్ క్లియర్ అయింది. గంటా, ఏరాసు సోమవారం టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేశ్ ఇంట్లో సమావేశమై తమ చేరికపై చర్చించారు.
టిడిపి ఎంపీలు సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ రావు కూడా ఈ భేటీలో పాల్గొన్నారని సమాచారం. ఇద్దరు మంత్రులు మాత్రమే ఈ భేటీలో పాల్గొన్నప్పటికీ, మరో మంత్రి టిజి వెంకటేశ్ అందుబాటులో లేకపోవడం వల్ల హాజరుకాలేకపోయారట.
ఈ ముగ్గురు మంత్రులతో పాటు పలువురు కాంగ్రెసు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరడానికి సుముఖంగా ఉన్నారని, ఇదే అంశంపై ఈ భేటీలో చర్చించినట్టు తెలిసింది. కాగా, తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు ఉంటాయని భావిస్తున్నారు.

మంత్రులు
కనీసం 20 మంది ఎమ్మెల్యేలు తమ వెంట వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, అయితే వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామన్న హామీ ఇస్తేనే టిడిపిలో చేరుతారని గంటా, ఏరాసు సూచించినట్టు తెలిసింది. అంతకుముందు గంటా శ్రీనివాస రావు నివాసంలో పలువురు నేతలు భేటీ అయి చర్చించారు.

మంత్రులు
ముగ్గురు మంత్రుల చేరికకు ఇప్పటికే చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారికి మాత్రమే టికెట్లు ఖాయమని, వీరి వెంట వచ్చే ఎమ్మెల్యేలకు మాత్రం టికెట్లపై హామీ ఇవ్వలేమని టిడిపి నేతలు స్పష్టం చేసినట్టు తెలిసింది.

మంత్రులు
టిడిపిలో చేరడానికి సిద్ధంగా ఉన్న ఎమ్మెల్యేల జాబితాను ఈ సందర్భంగా టిడిపి నేతలకు మంత్రి గంటా శ్రీనివాస్ రావు అందజేసినట్టు తెలిసింది.

మంత్రులు
ఈ జాబితాపై చంద్రబాబుతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం మంగళవారం తెలియజేసేందుకు టిడిపి నేతలు మంత్రులకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.

మంత్రులు
ఈ నెల 26న ఈ ముగ్గురు మంత్రులు చంద్రబాబుతో భేటీ అయిన తర్వాత, 27న పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైందని టిడిపి వర్గాల సమాచారం.












Click it and Unblock the Notifications