Times Now Survey: ఆ పార్టీకి అధికారం పక్కా: లెక్కలివే: లేటెస్ట్ సర్వే రిపోర్ట్‌లో సంచలనాలు

Times Now-ETG survey: ఏపీలో క్రమంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంటోంది. ఇంకో నాలుగు నెలల్లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఈ దిశగా అనేక చర్యలు తీసుకుంటోన్నారు. ప్రభుత్వం, పార్టీపరంగా అనేక సంచలన నిర్ణయాలను తీసుకుంటోన్నారు.

ఇందులో భాగంగానే- 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను ప్రకటించారు. గెలుపు గుర్రాలకే టికెట్ ఇస్తామనే సంకేతాన్ని పంపించారు. మహిళ, యువజన విభాగాల్లో కీలక మార్పులు చేశారు. ఈ రెండు విభాగాల్లోనూ కొత్త కమిటీని నియమించారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు వైఎస్ జగన్.

Times Now-ETG survey predicts that the YSRCP in AP will get 25 out of 25 seats in Lok Sabha

ఈ పరిస్థితుల్లో- ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై టైమ్స్ నౌ- ఈటీజీ ఒపీనియన్ పోల్స్ నిర్వహించింది. దీనికి సంబంధించిన సర్వే నివేదికను కొద్దిసేపటి కిందటే విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సర్వే రిపోర్ట్.. వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

లోక్‌సభకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..? అనే అంశం మీద ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించింది టైమ్స్ నౌ- ఈటీజీ. అన్ని లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ ఈ ఒపీనియన్ పోల్స్‌ను నిర్వహించింది. అన్ని సామాజిక వర్గాల, వయస్సు, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వయోధిక వృద్ధులు.. ఇలా అన్ని కేటగిరీలకు చెందిన వారి నుంచి ఒపీనియన్‌ను తెలుసుకుంది.

దీని ప్రకారం చూస్తే- ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలను కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి పారేస్తుంది. 24 లేదా 25 సీట్లను వైసీపీ సొంతం చేసుకుంటుంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి దక్కే లోక్‌సభ స్థానాలు దాదాపుగా జీరో. గెలవడం అంటూ జరిగితే ఒక్క లోక్‌సభ సీటు మాత్రమే గెలుచుకుంటుంది. జనసేన, బీజేపీలు ఖాతా కూడా తెరవలేవు.

Times Now-ETG survey predicts that the YSRCP in AP will get 25 out of 25 seats in Lok Sabha

ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే.. ఫ్యాన్ ప్రభంజనాన్ని సృష్టిస్తుంది. 50 శాతం ఓట్లను కొల్లగొడుతుంది. ఇది- 2019లో వైసీపీకి పోల్ అయిన ఓట్ల శాతం కంటే అధికం. తెలుగుదేశం పార్టీకి 37, జనసేనకు 10 శాతం ఓట్లు పడొచ్చు. బీజేపీకి దక్కే ఓట్ల శాతం.. ఒకటిగా తేల్చింది టైమ్స్ నౌ- ఈటీజీ.

లోక్‌సభ సీట్లల్లో సాధించే విజయాన్ని అసెంబ్లీకి అన్వయించుకుంటే.. ఇక్కడా వైసీపీకి ఎదురు ఉండదు. ఇక్కడా క్లీన్ స్వీప్ నమోదవుతుంది. ఒక్కో లోక్‌సభ పరిధిలో సగటున ఏడు అసెంబ్లీ స్థానాలను లెక్కలోకి తీసుకుంటే వైసీపీకి 151 కంటే ఎక్కువ సీట్లే లభిస్తాయి. 168 వరకు స్థానాల్లో విజయదుందుభి మోగించగలుగుతుంది వైసీపీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+