ట్రాక్‌పై బస్సు: బ్రేక్ వేయడంతో అడుగుల దూరంలో నిల్చిన రైలు
శ్రీకాకుళం: రైలు డ్రైవర్ అప్రమత్తతో సోంపేట మండలం బారువా రైల్వేస్టేషన్ పరిధిలోని పాలవలస రైల్వేగేటు సమీపంలో పెనుప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు రైల్వేట్రాక్ దాటుతూ పట్టాలపై ఆగిపోయింది. అదే సమయంలో ఆ మార్గంలో దురంతో ఎక్స్‌ప్రెస్ వస్తోంది.
బస్సును దూరం నుంచి గమనించిన లోకో పైలట్ రైలును బ్రేక్ వేసి ఆపేశాడు. దీంతో రైలు బస్సుకు 10 అడుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో ప్రయానికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

గేట్‌మ్యాన్, స్టేషన్‌మాస్టర్ సమన్వయం లోపం కారణంగానే సకాలంలో రైల్వేగేట్ వేయలేదు. దీంతో రైలు వచ్చే సమయంలో వాహనాలు రాకపోకలు సాగాయి. ఈ క్రమంలో 37మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ట్రాక్ దాటుతున్న సమయంలో గేట్ పడింది. దీంతో బస్సు పట్టాలపైనే నిలిచిపోయింది.
బస్సును కొంత దూరం నుంచి గమనించిన లోకో పైలట్ సమయస్ఫూర్తితో బ్రేక్ వేసి రైలును నిలిపివేశాడు. దీంతో పెద్దప్రమాదం తప్పినట్లయింది. రైలు డ్రైవర్ సమయస్ఫూర్తిని ఈ సందర్బంగా పలువురు అభినందించారు. కాగా, తనకు స్టేషన్‌మాస్టర్ నుంచి సకాలంలో సమాచారం రాలేదని, అందువల్లే గేట్ వేయలేకపోయానని రైల్వే సిబ్బంది భారతి తెలిపారు.












Click it and Unblock the Notifications