విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, భీమవరంవారికి ముఖ్య గమనిక
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో రైళ్ల భద్రతకు సంబంధించి ఆధునికీకరణ పనులు జరుగుతున్నాయి. దీంతో కొన్ని రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని దారి మళ్లించారు. ఈ మేరకు వాల్తేరు సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి వివరాలు వెల్లడించారు.
* ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకు గుంటూరు-విశాఖ(17239)
* 11 నుంచి 17 వరకు విశాఖ-గుంటూరు(17240) సింహాద్రి ఎక్స్‌ప్రెస్
* 10 నుంచి 16వ తేదీ వరకు కాకినాడ-విశాఖ-కాకినాడ (17267-17268)
* రాజమండ్రి-విశాఖ-రాజమండ్రి (07466-07467) రైళ్లను రద్దు చేశారు.
* ఈనెల 11, 14, 15 తేదీల్లో ధన్‌బాద్-అలప్పుజ (13351) బొకారో ఎక్స్ ప్రెస్
* 11వ తేదీ హాథియా-ఎస్‌ఎంవీ బెంగళూరు (12835)
* 14వ తేదీన 14న టాటానగర్-ఎస్‌ఎంవీ బెంగళూరు (12889)
* 15వ తేదీన హాథియా-ఎస్‌ఎంవీ బెంగళూరు (18637) రైళ్లను నిడదవోలు, భీమవరం, గుడివాడ, విజయవాడమీదగా దారిమళ్లించి తిప్పనున్నారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి రైల్వేకు సహకరించాలని డీసీఎం కోరారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం అత్యాధునిక సాంకేతికను పరిచయం చేస్తోంది. అలాగే ప్రధాన నగరాల మధ్య ఉండే ఎక్కువ దూరాన్ని సాధ్యమైంత తక్కువ సమయంలో చేరుకునేలా సెమీ హైస్పీడ్ రైళ్లు వందే భారత్ ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 23 సర్వీసులు నడుస్తున్నాయి. తాజాగా మరో 5 వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. రాణి కమలాపతి-జబల్పూర్, ఖజురహో-భోపాల్-ఇండోర్, మడ్‌గావ్- ముంబయి వందేభారత్ ఎక్స్‌ప్రెస్, ధార్వాడ్- బెంగళూరు, హాథియా-పాట్నా మధ్య ప్రారంభమైన సర్వీసులు దాదాపు గంటన్నర సమయాన్ని ఆదా చేయనున్నాయి.












Click it and Unblock the Notifications