మద్యం సేవించి బైక్ నడిపిన యువకులకు మహిళా ఎమ్మెల్యే కౌన్సిలింగ్
వరంగల్/కరీంనగర్: మద్యం సేవించి బైక్ నడుపుతూ తన కారును ఢీకొట్టిన యువకులకు కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ క్లాస్ తీసుకున్నారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం హసన్‌పర్తి బస్టాండ్‌లో చోటు చేసుకుంది. స్థానిక పోలీసులను పిలిపించి మద్యం తాగి వాహనం నడుపుతున్న యువకులకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించాలని ఆమె ఆదేశించారు.
వెంటనే రంగంలోకి దిగిన సీఐ రఘుచందర్ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని విచారించి వదిలివేశారు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ హన్మకొండ నుంచి కరీంనగర్ వెళ్తున్నారు. హసన్‌పర్తి బస్టాండు వద్ద ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనదారుడు మద్యం మత్తులో ప్రదాన రహదారిపై ఏర్పడిన గుంతలను తప్పిస్తూ ఎమ్మెల్యే బొడిగె శోభ కారుకు కొద్దిగా తాక్కుంటూ వెళ్లాడు.

దీంతో వెంటనే ఆమె కారును పక్కకు తప్పించి బస్టాండులో నిలిపివేసింది. పక్కనే ఉన్న ఫొటో స్టూడియోలో కూర్చొని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మద్యం తాగి వాహనం నడుపుతున్న వాహన చోదకులను అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇవ్వాలని సీఐ రఘుచందర్‌ను అదేశించారు.
కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్‌లో ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తున్న ఎమ్మెల్యే అరూరి రమేశ్, సీఐ రఘుచందర్ ఘటనా స్థలానికి చేరుకోవడంతో జరిగిన విషయాన్ని ఎమ్మెల్యే శోభ వారికి వివరించారు. దీంతో సీఐ రఘుచందర్ ద్విచక్రవాహనదారులను అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించడంతో సమస్య సద్దుమణిగింది.
సుమారు గంటపాటు సాగిన ఉత్కంఠకు తెరపడింది. దీంతో ఎమ్మెల్యే శోభ చొప్పదండికి బయలుదేరి వెళ్లారు. ఈ విషయంపై సీఐ రఘుచందర్‌ను వివరణ కోరగా ద్విచక్రవాహనదారులు మద్యం సేవించి వాహనాన్ని నడుపుతూ ఎమ్మెల్యే కారును ఢీకొట్టిన మాట వాస్తవమేనని, వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలివేసినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications