ట్రంప్ టారిఫ్స్! ఏపీ పరిస్థితిపై కేంద్రమంత్రికి చంద్రబాబు ఆందోళన
భారత్ సహా వివిధ దేశాల ఉత్పత్తులపై అమెరికా సుంకాలు పెంచుతున్న నేపథ్యంలో కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అమెరికా సుంకాలతో నష్టపోతున్న ఆక్వారంగాన్ని ఆదుకోవాలని, సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులు మినహాయింపు పొందేలా అమెరికా ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు.
ఏపీ జీడీపీలో మత్స్యరంగం కీలకంగా ఉందని పేర్కొన్న చంద్రబాబు.. సంక్షోభ మయంలో ఆక్వా రైతులకు అండగా ఉండాలని కోరారు. భారత్‌పై అమెరికా 27 శాతం సుంకం విధింపు వల్ల ఆక్వా రంగానికి నష్టమని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మన దేశం నుంచి అమెరికాకు 2.55 బిలియన్ల డాలర్ల విలువైన సముద్ర ఆహార ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయని అన్నారు. వీటిలో రొయ్యలే 92 శాతం వాటాను కలిగి ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.

అమెరికా దేశానికి రొయ్యల ఎగుమతిలో కీలకమైన భారతదేశంపై 27 శాతం దిగుమతి సుంకం కారణంగా ఆక్వా రైతాంగం నష్టపోతుందని వివరించారు. ఈక్వెడార్ వంటి ఎగుమతిదారులపై కేవలం 10 శాతం పన్ను మాత్రమే అమెరికా విధిస్తోందని, ఇది మన దేశానికి పరోక్షంగా నష్టం చేస్తూ, వారికి అనుకూలంగా మారుతోందని చంద్రబాబు తెలిపారు. దీనికి తోడు మన దేశ ఎగుమతిదారులు ఇప్పటికే 5.77 శాతం కౌంటర్‌వెయిలింగ్ డ్యూటీ (CVD) భారాన్ని మోస్తున్నారని వెల్లడించారు.
అన్ని సుంకాలను కలుపుకుంటే ఈక్వెడార్‌కు భారతదేశానికి మధ్య సుంకాల వ్యత్యాసం దాదాపు 20 శాతం ఉంటుందని చంద్రబాబు వివరించారు. అమెరికా విధించిన కొత్త సుంకం ఏప్రిల్ 5, 2025 నుంచి అమల్లోకి వచ్చిందని, దీని కారణంగా అమెరికా దేశానికి వెళ్లే అన్ని ఎగుమతులపైనా ఈ భారం పడుతోందన్నారు. యూరోపియన్ యూనియన్‌లో భారతీయ ఎగుమతిదారులు 50 శాతం తనిఖీ రేట్లు, 4-7 శాతం దిగుమతి సుంకంతో సహా నాన్-టారిఫ్ అడ్డంకులను ఎదుర్కొంటున్నారన్నారు.
కానీ, వియత్నాం వంటి దేశాలు EUతో వారి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద జీరో-డ్యూటీ పొందాయని, ఈ కారణంగా వియాత్నాం వంటి దేశాలు యూరోపియన్ మార్కెట్‌ను సమర్థవంతంగా ఆక్రమిస్తున్నాయని లేఖలో చెప్పారు. వియత్నాం, థాయిలాండ్, జపాన్ దేశాల మార్కెట్లు భారత్
నుంచి సీ ఫుడ్‌ను కొనుగోలు చేసి వాటిని ప్రాసెస్ చేసి అమెరికాకు
ఎగుమతి చేస్తాయన్నారు.
అయితే నేడు తుది ఉత్పత్తులపై విధించిన అధిక సుంకాల కారణంగా ఆ దేశాలు కూడా మనకు ఇచ్చిన ఆర్డర్లను రద్దు చేస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీ శీతల గిడ్డంగుల్లోనూ నిల్వ కోసం స్థలం లేదని తెలిపారు. ఈ క్రమంలో ఆక్వా రైతులు గందరగోళంలో ఉన్నారని కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు చంద్రబాబు వివరించారు.
-
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications