TTD: తిరుమలలో బ్రహ్మోత్సవాలు, హోటల్స్ పై టీటీడీ నిఘా, ఈవో సమీక్ష
కలియుగదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు రంగరంరగ వైభంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమలకు వేలాది మంది శ్రీవారి భక్తులు తరలి వస్తున్నారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్బంగా తిరుమలలో టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
తిరుమలలోని రంభగీచా 1 ఎదురుగా ఉన్న బ్రహ్మోత్సవం ప్రత్యేక సెల్‌లో టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనను విజయవంతం చేసినందుకు, బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నందుకు టీటీడీ ఈవో శ్యామలరావు టీటీడీ అధికారులు, సిబ్బందిని అభినందించారు.
తిరుమల యాత్రికులకు సేవలను మెరుగుపరచడంలో అన్ని శాఖల అధిపతులు క్రియాశీలక పాత్ర పోషించాలని టీటీడీ ఈవో శ్యామలరావు మనవి చేశారు. ప్రతి కార్యక్రమానికి చెక్‌లిస్ట్ ఉండాలని, తిరుమల యాత్రికుల నుండి సరైన అభిప్రాయ సేకరణ ప్రధాన పాత్ర పోషిస్తుందని టీటీడీ ఈవో శ్యామలరావు అధికారులకు చెప్పారు.
అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావు ఎనిమిది మంది సెక్టోరల్ అధికారుల నుండి అభిప్రాయాన్ని స్వీకరించారు.

టీటీడీ అధికారులందరూ సమన్వయంతో భక్తులకు సేవలు అందించాలని టీటీడీ ఈవో ఆదేశించారు.
తినుబండారాల ధరలు, పరిశుభ్రత, ట్యాక్సీల ద్వారా వసూలు చేస్తున్న ధరలను అప్పుడప్పుడు తనిఖీ చేయాలని, ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను టీటీడీ ఈవో శ్మామలరావు ఆదేశించారు.
ఈ సమావేశంలో టీటీడీ జేఈఓలు శ్రీమతి గౌతమి, వీరబ్రహ్మం, సీవీఎస్‌వో శ్రీధర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications