ఏడుకొండలపై టీటీడీ ట్రస్ట్ బోర్డు నిర్ణయాలు

Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం నాడు 69,214 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 26,599 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 3.27 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌‌లో ఎనిమిది కంపార్ట్‌మెంట్లల్లో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 6 నుంచి 8 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

TTD Trust decided land adjacent to the 7 hills should not be allotted to private individuals

కాగా- టీటీడీ పాలక మండలి నేడు అత్యవసరంగా సమావేశమైంది. ఈ ఉదయం 11 గంటలకు తిరుమలలోని అన్నమయ్య భవన్ పాలక మండలి కార్యాలయం భేటీ అయింది. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు దీనికి అధ్యక్షత వహించారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఎక్స్ అఫీషియో మెంబర్ దీనికి హాజరయ్యారు.

టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్, జేఈఓ వీరబ్రహ్మం పాల్గొన్నారు. సుమారు నాలుగు గంటల పాటు ఈ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకు వచ్చాయి. తిరుమల పవిత్రతను కాపాడే విషయంలో రాజీ పడకూడదని నిర్ణయించింది.

ప్రత్యేకించి- భూముల కేటాయింపు అంశంపై టీటీడీ పాలక మండలి ఈ భేటీ చర్చించింది. ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఆధ్యాత్మిక పుణ్య‌క్షేత్ర‌మైన తిరుమల పవిత్రతను కాపాడటంలో భాగంగా- ఏడుకొండలకు ఆనుకొని ఉన్న భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించరాదని పాలక మండలి నిర్ణయం తీసుకుంది.

ఇదివరకే తిరుప‌తి రూర‌ల్ మండ‌లం పేరూరు గ్రామంలోని స‌ర్వే నంబర్ 604లో ఆంధ్ర ప్ర‌దేశ్ టూరిజం అథారిటీ (ఏపీటీఏ)కు చెందిన 24.68 ఎక‌రాల భూమిని టీటీడీకి బ‌ద‌లాయించాలని గతంలో బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆ స్థలానికి బ‌దులుగా తిరుప‌తి అర్బన్ స‌ర్వే నంబర్ 588-ఏ లో ఉన్న టీటీడీకి చెందిన 24.68 ఎక‌రాల స్థ‌లాన్ని ఏపీటీఏకు బదలాయించే ప్రతిపాదనలపై బోర్డు ఆమోదం తెలిపింది.

అదేవిధంగా తిరుప‌తి రూర‌ల్ లోని సర్వే నంబర్ 604లో ఏపీటీఏకు చెందిన మరో 10.32 ఎక‌రాల స్థ‌లాన్ని టీటీడీకి బ‌ద‌లాయించ‌డం, దానికి బ‌దులుగా తిరుపతి అర్బన్ లోని స‌ర్వే నెంబ‌ర్ 588-ఏ లో టీటీడీకి చెందిన 10.32 ఎక‌రాల స్థ‌లాన్ని ఏపీటీఏకు కేటాయించే ప్రక్రియను వేగవంతం చేయాలని టిటిడి బోర్డు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+