వ్యాపారి మిస్సింగ్ కేసులో ట్విస్ట్: ముగ్గురు యువతుల అదృశ్యం
హైదరాబాద్: సికింద్రాబాద్‌లో వ్యాపారి నర్సింగ్ మిస్సింగ్ కేసులో కొత్తమలుపు తిరిగింది. వడ్డీ వ్యాపారుల ఆగడాలు భరించలేక నర్సింగ్ అదృశ్యమయ్యాడని జరుగుతున్న ప్రచారానికి భిన్నంగా కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తాము కష్టపడి దాచుకున్న డబ్బును నర్సింగ్‌కు ఇస్తే ఉడాయించాడని వడ్డీ వ్యాపారులు చెబుతున్నారు.
రౌడీ షీటర్ అయిన అల్లుడు కృష్ణ సాయంతో నర్సింగ్ నాటకం ఆడుతున్నాడని వారు ఆరోపిస్తున్నారు. నర్సింగ్‌ను పోలీసులు విచారిస్తే అసలు విషయాలు బయటపడతాయని వారు అంటున్నారు.
కాగా, నెల్లూరు జిల్లాలోని ప్రగతి చారిటీస్‌లో అనాధలైన ముగ్గురు యువతులు అదృశ్యమయ్యారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. అయ్యప్పగుడి సెంటర్ సమీపంలో మానసిక వికలాంగులు, బధిరుల సంస్థలో ఈ ముగ్గురు ఉంటున్నారు. యువతులు అదృశ్యమైన విషయాన్ని నిర్వాహకులు రహస్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కూతురితో సహా దంపతుల ఆత్మహత్యాయత్నం
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలోని మన్నయ్యపేటలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కూతురితో సహా దంపతులు బావిలో దూకి ఆత్మహత్యయత్నం చేశారు. ఈ సంఘటనలో భర్త మృతి చెందగా, కూతురు, భార్య పరిస్థితి విషమంగా మారింది.












Click it and Unblock the Notifications