మహిళపై ఫుట్‌పాత్‌పై వరుసగా గ్యాంగ్ రేప్

ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మూడో నిందితుడు పరారీలో ఉన్నాడు. బిక్షమెత్తుకుంటూ జీవిస్తున్న మహిళ గత కొన్నివారాలుగా నావెల్ క్యాంటిన్ సమీపంలో ఫుట్‌పాత్‌పై పడుకుంటోంది. ఇది గమనించి రాత్రి పూట ముగ్గురు వ్యక్తులు వరుసగా సామూహిక అత్యాచారానికి పాల్పడడం సాగించారు.
ఆ దారుణాన్ని గమనించిన ఆటో డ్రైవర్లు కొంత మంది పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసుల గస్తీ సందర్భంగా సంఘటనా స్థలం నుంచి నిందితులు పారిపోయారు. వారి కోసం గాలించిన పోలీసులు ఇద్దరిని పట్టుకోగలిగారు.
వారిపై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ పోలీసు ఇన్‌స్పెక్టర్ సయ్యద్ మొహమ్మద్ చెప్పారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం పంపించినట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications