అన్నవరం కొండపై పేలిన సిలిండర్లు: ఇద్దరికి తీవ్ర గాయాలు
తూర్పుగోదావరి: జిల్లాలోని అన్నవరం కొండపై భారీ పేలుడు సంభవించింది. కొండపైన వంటశాలలో రెండు సిలిండర్లు పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని కాకినాడలోని ఆస్పత్రికి తరలించారు.
మరో ఇద్దరికి ఈ ఘటనలో స్వల్ప గాయాలయ్యాయి. సిలిండర్లు పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. వంటశాలలోని సిబ్బంది బయటికి పరుగులు తీశారు. వంటశాలలో భారీగా గోధుమ, పంచధార నిల్వలు ఉన్నాయి.
కాగా, సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు.

బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం
చిత్తూరు జిల్లాలోని ఎస్‌ఆర్‌పురం మండలం పుల్లూరుక్రాస్ రోడ్డులోని ఓ బట్టల దుకాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు.
విద్యుత్‌షాక్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో షాపు పూర్తిగా దగ్ధమైంది. దాదాపు రూ. లక్ష ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది.
కాంట్రాక్టర్ ఇంట్లో భారీ చోరీ
విజయనగరం జిల్లాలోని పార్వతీపురంలో ఓ కాంట్రాక్టర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు 30 తులాల బంగారం, ఐదు కేజీల వెండి, రూ.50 వేల నగదును అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications