విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నలుగురు దొంగల అరెస్ట్: బంగారం స్వాధీనం(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: జల్సాలకు, వ్యసనాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదన కోసం దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మైనర్లతో సహా నలుగురు నిందితులను దువ్వాడ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 210 గ్రాముల బంగారం, 160 గ్రాముల వెండి ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు క్రైం డిసిపి జె మురళీధర్ వివరాలను వెల్లడించారు.

రాజీవ్ నగర్, రాసలమ్మ కాలనీలో నివసిస్తున్న బొడ్డు సత్తిబాబు(25), కరతిల్ కుమార్(24), మరో ఇద్దరు మైనర్ బాలురు ఈ కేసులో ప్రధాన నిందితులు. మద్యానికి, చెడు తిరుగుళ్లకు అలవాటుపడిన ఈ నలుగురు చోరీలు చేయడం ప్రారంభించారు. గాజువాక పోలీస్ స్టేషన్ పరిధి ప్రాంతాల్లో 7 చోరీలు చేసి బంగారు, వెండి ఆభరణాలతో పరారయ్యారు.

వన్‌టౌన్ కురుపాం మార్కెట్ బంగారు దుకాణాల్లో చోరీ వస్తువులను అమ్మడానికి నిందితులు రావడంతో.. అనుమానం వచ్చిన దుకాణందారు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

ఇద్దరు నిందితులను రిమాండ్‌కు, ఇద్దరు బాలురను సంరక్షణ గృహాలకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో సిఐ కోటేశ్వర్రావు, ఎస్సైలు రత్నారావు, చక్రధరరావు, సిబ్బంది కిశోర్, హరి, తదితరులు పాల్గొన్నారు.

దొంగల అరెస్ట్

దొంగల అరెస్ట్

జల్సాలకు, వ్యసనాలకు అలవాటుపడి సులువుగా డబ్బు సంపాదన కోసం దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మైనర్లతో సహా నలుగురు నిందితులను దువ్వాడ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు

దొంగల అరెస్ట్

దొంగల అరెస్ట్

దొంగల వద్ద నుంచి 210 గ్రాముల బంగారం, 160 గ్రాముల వెండి ఆభరణాలు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు క్రైం డిసిపి జె మురళీధర్ వివరాలను వెల్లడించారు.

దొంగల అరెస్ట్

దొంగల అరెస్ట్

రాజీవ్ నగర్, రాసలమ్మ కాలనీలో నివసిస్తున్న బొడ్డు సత్తిబాబు(25), కరతిల్ కుమార్(24), మరో ఇద్దరు మైనర్ బాలురు ఈ కేసులో ప్రధాన నిందితులు. మద్యానికి, చెడు తిరుగుళ్లకు అలవాటుపడిన ఈ నలుగురు చోరీలు చేయడం ప్రారంభించారు.

దొంగల అరెస్ట్

దొంగల అరెస్ట్

వన్‌టౌన్ కురుపాం మార్కెట్ బంగారు దుకాణాల్లో చోరీ వస్తువులను అమ్మడానికి నిందితులు రావడంతో.. అనుమానం వచ్చిన దుకాణందారు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

English summary

 The crime police Tuesday arrested four persons, including two juveniles, in connection with four theft cases that were registered in Duvvada police station in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X