దాడులు: అనారోగ్యం వల్లే లొంగిపోయారు(ఫోటోలు)
అమరావతి: మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు దళ సభ్యులు, మరో ఇద్దరు మిలీషియా సభ్యులు లొంగిపోయినట్టు జిల్లా ఎస్పీ డాక్టర్ కోయా ప్రవీణ్ వెల్లడించారు. గాలికొండ దళ సభ్యుడు వంతల చిన్నంనాయుడు అలియాస్ అబ్రహం (30), కోరుకొండ దళ సభ్యుడు పొంగి సోమరాజు (19), మిలీషియా సభ్యులు పాంగి చంటి, పాంగి రాంబాబు వివిధ కారణాల వల్ల లొంగిపోయినట్టు ఆయన తెలిపారు.
లొంగిపోయిన నలుగురిని మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జీకే వీధి మండలం చెరుకుంపాకలు గ్రామానికి చెందిన వంతల చిన్నంనాయుడు అనారోగ్యంతోపాటు కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో లొంగిపోయాడని అన్నారు.

విశాఖలో నలుగురు లొంగుబాటు
చిన్నం నాయుడు తీములబంద గ్రామంలో పోలిరెడ్డి అప్పలనాయుడు, కొర్రా నాగేశ్వరరావు ఇళ్లపై జరిపిన కరువు దాడిలో పాల్గొన్నాడన్నారు. అదే మాదిరిగా తీములబంద, లంకపాకులలో ఏపీఎఫ్‌డీసీ గౌడౌన్లు, క్వార్టర్ల పేల్చివేత ఘటనల్లో పాల్గొన్నాడని ఆయన తెలిపారు.

విశాఖలో నలుగురు లొంగుబాటు
చిన్నంనాయుడుపై లక్ష రూపాయల నగదు రివార్డు ఉన్నట్టు ఎస్పీ వివరించారు. ఇక కోరుకొండ దళ సభ్యుడు పాంగి సోమరాజు పెద్దల కౌన్సిలింగ్ కారణంగా లొంగిపోవడానికి ముందు వచ్చాడని ఆయన తెలిపారు.

విశాఖలో నలుగురు లొంగుబాటు
చింతపల్లి మండలం కుడుమసార పంచాయితీకి చెందిన సోమరాజు 2010లో మిలీషియా సభ్యుడిగా పార్టీలోకి వెళ్లాడన్నారు. దళ సభ్యుడిగా కడుంసారి పంచాయితీ ఉపాధ్యక్షుడు కొర్రా చిన్నయ్య హత్య, గదలంవీధి గురువు సింహాచలం ఆశ్రమంపై దాడిలో పాల్గొన్నాడన్నారు.

విశాఖలో నలుగురు లొంగుబాటు
పాంగి చంటి, పాంగి రాజారావు గాలి కొండ ఏరియా కమిటీ కార్యకలాపాలకు సహాయ, సహకారాలు అందిస్తున్నట్టు ఎస్పీ వివరించారు.












Click it and Unblock the Notifications