నిద్రిస్తున్న మూగ బాలికపై సామూహిక అత్యాచారం

కుటుంబ సభ్యులు ఇంటికి రాగానే బాధితురాలు జరిగిన విషయాన్ని సైగలతో తెలిపింది. దీంతో వెంటనే బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. బాలికను నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారి కుటుంబానికి బాగా తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఫార్మసీ విద్యార్థి మృతి
రంగారెడ్డి: జిల్లాలోని హయత్‌నగర్ మండలం అబ్దుల్లాపూర్‌మెట్‌లోని గండి మైసమ్మ ఆలయ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎం.ఫార్మసీ విద్యార్థి మృతి చెందాడు. ఓ ఇన్నోవా వాహనం అదుపుతప్పి రెండు బైక్‌లను ఢీకొట్టింది. బైక్‌పై వెళుతున్న ఎస్ఎల్‌సిఎస్ కళాశాలలో ఎం.ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రాంమూర్తి (24) అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాదంలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హయత్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. రాంమూర్తి మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications