'ఆధార్' కేంద్రాలతో పని లేదు, కీలక మార్పులు - ఇక అన్ని సేవలు ఒకే చోట..!!
ఆధార్ సేవలు మరింత సులభతరం కానున్నాయి. ఇప్పటికే ఆధార్ నిర్వహణలో పలు మార్పులు వచ్చాయి. తాజాగా మిర్ని మార్పుల దిశగా యూఐడీఏఐ కసరత్తు చేస్తోంది. ఆన్ లైన్ లోనే ఇక ఆధార్ లో కావాల్సిన మార్పులు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించారు. ఇక నుంచి ఆధారం కేంద్రాలకు వెళ్లే అవసరం లేకుండా బయోమెట్రిక్ అథెంటికేషన్‌లో కూడా కీలక మార్పులు తీసుకువచ్చారు.
ఆధార్ లో కావాల్సిన మార్పులు చేసుకునే విధానంలో కీలక మార్పులు వచ్చాయి. మొబైల్ నంబర్, ఈ మెయిల్ అడ్రస్, చిరునామాను సులభంగా ఆన్ లైన్ లోనే మార్పులు చేసుకునే విధంగా అప్డేట్ జరిగింది. బయోమెట్రిక్ అథెంటికేషన్‌లో కూడా కీలక మార్పులు తీసుకువచ్చారు. ఇప్పటి వరకు ఉన్న ఫింగర్ ప్రింట్, కంటి ఐరిస్ స్కాన్‌ను ఇప్పుడు మరింత ప్రతిభావంతంగా పనిచేసేలా మార్పులు చేశారు. ఫలితంగా బ్యాకింగ్, ఇన్సూరెన్స్ తో పాటు కావాల్సిన విధంగా సేవలు ఉపయోగించే సమయంలో సులభంగా, వేగంగా పనులు పూర్తిచేసుకొనే వెసులుబాటు కలుగుతుంది. ఆధార్ కార్డు దారుల గోప్యత దృష్టిలో పెట్టుకుని కొన్ని నిర్ణయాలు తీసుకుంది.

గోప్యతను కాపాడే క్రమంలో భాగంగా కార్డులోని 12 అంకెల పూర్తి ఆధార్ నంబర్ కాకుండా చివరి నాలుగు నంబర్లు మాత్రమే కనిపిస్తాయి. దీని వల్ల యూజర్ల ప్రైవసీ భద్రంగా ఉంటుంది. అదే విధంగా బ్యాకింగ్ రంగంలో ముఖ్యమైన ఈ కేవైసీ ప్రక్రియను మరింత సులభంగా మార్చారు. ఫలితంగా కొత్త బ్యాంక్ ఖాతా, మొబైల్ కనెక్షన్, లేదా ఏదైనా ఆన్లైన్ సేవలను సులభంగా పొందే అవకాశం కలుగుతుంది. పాన్, బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కార్డును లింక్ చేసినప్పటి నుంచి ట్యాక్స్, ఆర్థిక సేవలకు సంబంధించిన మోసాలు నియంత్రణలోకి వచ్చాయి. ఇక నుంచి బయోమెట్రిక్ వెరిఫికేషన్‌లో భాగంగా ఫేస్ అథెంటికేషన్ ఫీచర్‌ను తీసుకురానుంది.
ఇకపై ఆధార్ వెరిఫికేషన్ ను ఆఫ్ లైన్ లోనూ చేసుకునేలా యూఐడీఏఐ కొత్త ఫీచర్ ను అందు బాటులోకి తీసుకొస్తోంది. దీని వల్ల ఇంటర్నెట్ సదుపాయం లేకుండానే ఆధార్ వెరిఫికేషన్ సులభంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా డిజిటల్ ఆధార్ వాలెట్ లా ఉపయోగపడేలా కొత్తగా ఒక యాప్‌ను తీసుకురానుంది యూఐడీఏఐ. ఫలితంగా ఆన్లైన్, ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ సులభంగా కావడంతో పాటు యూజర్ వివరాలు భద్రంగా ఉంటాయి. వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచేలా కొత్త ఎన్క్రిప్షన్, మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ను యూఐడీఏఐ ప్రవేశపెట్టనుంది. వీటిని త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేలా కసరత్తు వేగవంతం చేసింది.












Click it and Unblock the Notifications