వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు తెగదెంపులు ఇప్పట్లో లేవు, కేంద్రం అలాగే చూస్తోంది: ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Undavalli Arun Kumar Fires Over Budget 2018

రాజమహేంద్రవరం: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కేంద్రంతో ఇప్పట్లో తెగదెంపులు చేసుకోరని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జోస్యం చెప్పారు. అంతేగాక, టీడీపీ బెదిరింపులతో ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన స్పష్టం చేశారు.

సోమవారం రాజమహేంద్రవరంలో ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ వెల్‌లోకి టీడీపీ ఎంపీలు పోరాటం చేస్తే ఏం ప్రయోజనం లేదని అన్నారు.

టీడీపీని నాశనం చేస్తున్నారు, మీవాడ్ని కాదా? బాబుపై గౌరవంతోనే: జయరాములు సంచలనం టీడీపీని నాశనం చేస్తున్నారు, మీవాడ్ని కాదా? బాబుపై గౌరవంతోనే: జయరాములు సంచలనం

ప్రజల కోసం కాదని కేంద్రం..

ప్రజల కోసం కాదని కేంద్రం..

ఆంధ్రాకు ఏమిచ్చినా.. కాంట్రాక్టర్ల కోసమే కానీ.. ప్రజల కోసం కాదన్న అభిప్రాయం కేంద్రంలో ఉందని ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కేంద్రంతో పోరాటానికి ఇంకా అవకాశం ఉందని, నేరుగా పోరాటం చేయాలని సూచించారు.

కేంద్రాన్ని ఏమని ప్రశ్నించాలి

కేంద్రాన్ని ఏమని ప్రశ్నించాలి

ఇక కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ఉండవల్లి పెదవి విరిచారు. రైతులకు గిట్టుబాటు ధర శుద్ధ అబద్ధమని ఆయన అన్నారు. వైద్యానికి ఐదు లక్షల బీమా పథకంలో అర్థం పర్థం లేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు గత నాలుగేళ్లుగా బడ్జెట్ ఏం జరిగిందో ఇప్పుడూ అదే జరిగిందని ఉండవల్లి చెప్పారు. విభజన చట్టంలో భాగంగా విశాఖలో పెడతామన్న రిఫైనరీని ఇప్పుడు ముంబైలో పెడుతుంటే ఏమనాలని ఉండవల్లి ప్రశ్నించారు.

బాబు నాటకాలివే...

బాబు నాటకాలివే...

కేంద్ర బడ్జెట్‌పై చంద్రబాబు నాటకాలాడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం అసమర్థతోనే రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని అన్నారు. మోడీ సర్కారుతో యుద్ధమంటూ మీడియాకు లీకులిచ్చారని, ఆ తర్వాత ఎన్డీఏలో కొనసాగుతామని అధికారిక ప్రకటనలు చేయడం చూస్తే ఆయనకు రాష్ట్రం పట్ల ఉన్న అభిమానం ఎంతో అర్థమవుతుందన్నారు.

అందుకు బాబు రాజీ

అందుకు బాబు రాజీ

ఓటుకు నోటు కేసులో బయటపడేందుకు ప్రత్యేక హోదాపై చంద్రబాబు రాజీ పడ్డారని ఆరోపించారు. విభజన హామీలతోపాటు, ప్రత్యేక ప్యాకేజీ సాధించడంలో సైతం విఫలమయ్యారని విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ న్యాయమైందేనని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.

English summary
Former MP Undavalli Arun Kumar on Monday lashed out at Andhra Pradesh CM Chandrababu Naidu in budget issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X