బెజవాడలో పట్టపగలు నరికేశారు, కొడుకు మృతి: వివాహేతర సంబంధమే!
పట్టపగలు నడి రోడ్డుపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. విజయవాడ కేదారేశ్వరపేటలో ఈ దారుణం జరిగింది. వివాహేతర సంబంధం వల్లే ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది.
విజయవాడ: పట్టపగలు నడి రోడ్డుపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. విజయవాడ కేదారేశ్వరపేటలో ఈ దారుణం జరిగింది. వివాహేతర సంబంధం వల్లే ఈ దాడి జరిగినట్లుగా తెలుస్తోంది.
కేదారేశ్వరపేటలో ఓ తల్లి, కొడుకు బైక్ పైన వెళ్తున్నారు. వారు వెళ్తుండగా హఠాత్తుగా కొందరు వచ్చి మారణాయుధాలతో వారిపై దాడి చేశారు. వారి బైక్‌ను అడ్డుకొని, దారుణంగా నరికారు.

ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకొని బాధితులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
తల్లి, కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. కొడుకు చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బైక్ నెంబర్ ఆధారంగా బాధితుల వివరాలను పోలీసులు గుర్తించారు.
గోడకూలి నలుగురు తాపీ మేస్త్రీలు మృతి
విజయనగరం జిల్లా ఎస్ కోట మండలం పోతనాపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పాత గోడకు మెరుగులు దిద్దుతుండగా గోడకూలి నలుగురు తాపీ మేస్త్రీలు మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.












Click it and Unblock the Notifications