అలాగైతేనే గెలుపు: ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం చంద్రబాబు ఫోన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు. యూపీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోడీకి ఫోన్ చేశారు. యూపీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. అభివృద్ధితోనే గెలుపు ఉంటుందని చంద్రబాబు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
కాగా, యూపీలో బీజేపీ అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. 403 అసెంబ్లీ స్థానాలున్న అతిపెద్ద రాష్ట్రంలో 300 మార్క్ దాటింది. ఎస్పీ- కాంగ్రెస్ కలిసి పోటీ చేసినా బీజేపీ ముందు తేలిపోయాయి. బీఎస్పీ కేవలం 23 స్థానాలకు పరిమితమైంది.

కాగా, ఎస్పీ నేత శివపాల్ యాదవ్ 35 వేల మెజార్టీతో గెలుపొందారు. రాజాభయ్యా లక్ష మెజార్టీతో గెలిచారు. నోయిడాలో రాజ్ నాథ్ సింగ్ తనయుడు గెలుపొందారు. అయోధ్యలో బీజేపీ గెలిచింది.












Click it and Unblock the Notifications