నిముషానికి కోటిరూపాయల రెమ్యునరేషన్
మాస్ సినిమాలకు ఐటం సాంగ్‌లే కీలకమవుతాయి. మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేందుకు, అందాల ఆరబోతతో వారిని కట్టి పడేసేందుకు ప్రతి దర్శకుడు ఓ మాంచి మాస్ మసాలా పాటను కచ్చితంగా పెడతారు. పక్కా మాస్ తో రూపుదిద్దుకునే సినిమాలకు స్పెషల్ సాంగ్ అనేది కచ్చితం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఆ సాంగ్ సినిమా చివరలో వస్తుందా? లేదంటే మొదట్లో వస్తుందా? అన్నది ముఖ్యంకాదు.. ఉండాలనేది ఒక నియమంగా మారిపోయింది.
తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ అంటే ఊర్వశీ రౌతేలానే అందరికీ గుర్తొస్తుంది. వాల్తేరు వీరయ్య సినిమాలో వేర్ ఈజ్ ది పార్టీ అంటూ ఊర్వశీ స్టెప్పులు ఇరగ్గొట్టింది. చిరంజీవి సినిమా కావడంతో ఆ పాట బాగా ట్రెండ్ అయింది. అయితే ఆ పాటద్వారా ఊర్వశికి ఎక్కువ పేరు రాలేదు. ప్రేక్షకులు ఊహించినరీతిలో ఆమెను దర్శకుడు చూపించలేకపోయాడు. అయినా పాట ట్రెండ్ కావడంతో రౌతేలా ఖాతాలో ఒక హిట్ సాంగ్ పడింది.

ప్రస్తుతం తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్ అంటే ఊర్వశి కేరాఫ్ అడ్రస్ గా మారింది. సంపత్ నంది దర్శకత్వంలో హీరోయిన్ గా ఓ సినిమా చేస్తోంది. కాకపోతే అది రోజురోజుకు ఆలస్యమవుతూ వస్తోంది. తాజాగా బ్రో సినిమాలో కూడా ఒక సాంగ్ చేసింది. పవన్ కల్యాణ్ తో దిగిన ఫొటోను ఊర్వశి షేర్ చేసింది. అలాగే రామ్ పోతినేని హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమాలోను తను ప్రత్యేక పాటలో నర్తించింది. ఈ పాటకోసం తను తీసుకున్న రెమ్యునరేషన్ గురించి తెలుగు సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది.
సినిమాలో కేవలం మూడు నిముషాలు మాత్రమే ఉండే ఆ పాటకు రూ.3 కోట్ల రెమ్యునరేషన్ అడిగినట్లు తెలుస్తోంది. నిముషానికి కోటిరూపాయల చొప్పున తీసుకున్నట్లు అవుతోంది. ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే నటి ఎవరూ లేరని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే ఈ వార్త నిజమో, కాదో తెలియాలంటే ఊర్వశి స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications