బేబీ బ్యూటీకి అదిరిపోయే ఛాన్స్
తెలుగు సినీ పరిశ్రమలో ఎక్కడ చూసినా వినపడుతున్న పేరు ఒక్కటే.. వైష్ణవి చైతన్య. బేబీ సినిమా సూపర్ హిట్ కావడంతో అందులో నటించిన హీరోయిన్ వైష్ణవి పేరు మార్మోగిపోతోంది. డబ్ స్మాష్ వీడియోలతో కెరీర్ ప్రారంభించిన వైష్ణవి చైతన్య.. ఆ తర్వాత టిక్ టాక్, ఇన్ స్టా గ్రామ్ రీల్స్‌తో మంచి పేరు, పేరుతోపాటు క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్ తోనే యూట్యూబ్ లో వీడియోలు చేసింది.
అలాగే కొన్ని సినిమాల్లో ఆకట్టుకునే చిన్న చిన్న పాత్రలు కూడా చేసింది. అల వైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా కనిపించింది. ఇక బేబీ సినిమాలో కథానాయికగా నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకులనే కాదు యావత్ సినీ పరిశ్రమ దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా చూసిన వారంతా వైష్ణవి నటన పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా ఈ బ్యూటీ బంపర్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. బేబీ సినిమా తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు తలుపు తడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ అమ్మడుకు దర్శకుడు పూరీ జగన్నాథ్ అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ పోతినేని హీరోగా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నారు. ఇందులో ఇద్దరు కథానాయికలకు చోటుంది. ఒక హీరోయిన్ గా వైష్ణవిని పూరీ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
బేబీ సినిమాలో వైష్ణవి నటన చూసి పూరీ ఫిదా అయ్యారని, అందుకే వెంటనే తన డబుల్ ఇస్మార్ట్ లో అవకాశం ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇటీవలే హీరో రామ్ పోతినేని కూడా వైష్ణవి నటనను మెచ్చుకుంటూ ఒక పెద్ద పూలబొకేను పంపించారు. తాజాగా డబుల్ ఇస్మార్ట్ లో అవకాశం రావడంతో వైష్ణవి రేంజ్ మారిపోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అధికారికంగా ఈ వార్తను చిత్ర యూనిట్ ప్రకటించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications